జగనన్న సురక్షలో విద్యుత్ సమస్యలపై నిలదీత
ABN , First Publish Date - 2023-06-26T23:04:21+05:30 IST
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ప్రజాప్రతినిధులను, అధికారులను పలు సమస్యలపై ప్రజలు నిలదీస్తున్నారు.
విపరీతంగా పెంచిన చార్జీలను కట్టలేం
పామూరు, జూన్ 26 : ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ప్రజాప్రతినిధులను, అధికారులను పలు సమస్యలపై ప్రజలు నిలదీస్తున్నారు. మండలంలోని వగ్గంపల్లిలోని ఎస్టీ కాలనీలో జగనన్న సురక్ష కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ప్రజల సమస్యలను వలంటీర్ల యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఎస్టీలు తమకు విద్యుత్ బిల్లులు అధికంగా వచ్చాయని నిలదీశారు. ఎనర్జీ అసిస్టెంట్ విద్యుత్ సమస్యలున్నా స్పందించడంలేదని ఆరోపించారు. దాంతో గ్రామ సర్పంచ్ సుబ్బయ్య విద్యుత్ సిబ్బందిపై ఆగ్రహం వ్వక్తం చేశారు. తహసీల్దార్ ఆవుల సురేష్, నేత జి. హుసేన్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు అనిత పాల్గొన్నారు.