జైలుకెళ్లిన జగన్‌కు, మచ్చలేని లోకే్‌షతో పోలికేంటి?

ABN , First Publish Date - 2023-08-02T23:53:00+05:30 IST

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేలకోట్ల రూపాయలు దోచుకుని జైలు జీవితం గడిచిన మీ నాయకుడు జగన్‌కు, మచ్చలేని మానాయకుడు లోకే్‌షకు సరిపోలిక ఏంటని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకే్‌షపై ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. లోకే్‌షకు ఏమీ తెలియదని మీరు మాట్లాడడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, అతనికి సన్నాఫ్‌ చంద్రబాబు తప్ప ఆయన అర్హత ఏమిటని అనడం శోచనీయమన్నారు.

జైలుకెళ్లిన జగన్‌కు, మచ్చలేని లోకే్‌షతో పోలికేంటి?
సమావేశంలో మాట్లాడుతున్న పాపారావు

లోకే్‌షపై ఎమ్మెల్యే మద్దిశెట్టి వ్యాఖ్యలను ఖండించిన టీడీపీ నాయకులు

దర్శి, ఆగస్టు 2 : తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేలకోట్ల రూపాయలు దోచుకుని జైలు జీవితం గడిచిన మీ నాయకుడు జగన్‌కు, మచ్చలేని మానాయకుడు లోకే్‌షకు సరిపోలిక ఏంటని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకే్‌షపై ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. లోకే్‌షకు ఏమీ తెలియదని మీరు మాట్లాడడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, అతనికి సన్నాఫ్‌ చంద్రబాబు తప్ప ఆయన అర్హత ఏమిటని అనడం శోచనీయమన్నారు. జగన్‌కు ఏమి తెలుసునని సన్నాఫ్‌ వైఎస్సార్‌ పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టి జైలుకెళ్లిన నీచ చరిత్ర లోకే్‌షకు లేదని చెప్పారు. జైలు జీవితం గడిపిన మీ నాయకుడికీ.. మచ్చలేని మా నాయకుడికీ పోలిక ఏమిటని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని బోధనంపాడు వద్ద 20 ఎకరాల ప్రభుత్వ భూమిని మీరు ఆక్రమించుకున్నది వాస్తవం కాదా అని నిలదీశారు. లోకేష్‌ చేసిన ఆరోపణలు నిరూపించేందుకు తాము సిద్ధమన్నారు. నియోజకవర్గంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.2వేల కోట్ల మేర అభివృద్ధి జరిగిందని, గడిచిన నాలుగేళ్లలో మీరు చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. మిమ్మల్ని ఓడించేందుకు మా పార్టీలో నాయకుడు అవసరం లేదని, కార్యకర్త నిల్చుంచటే చాలని ఎద్దేవా చేశారు. నగర పంచాయతీ ఎన్నికల్లో ఏం జరిగిందే ఒక్కసారి గుర్తుతెచ్చుకోవాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో మీకు డిపాజిట్లు దక్కవని జోస్యం చెప్పారు. సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు చిట్టె వెంకటేశ్వర్లు, నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, పట్టణ టీడీపీ అధ్యక్షుడు యాదగిరి వాసు, మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు, దొనకొండ, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల అధ్యక్షులు ఎన్‌.శివకోటేశ్వరరావు, కూరపాటి శ్రీనివాసరావు, బొమ్మరెడ్డి ఓబుల్‌రెడ్డి, తిరుపతిరావు, మధు, కొండారెడ్డి, సుబ్బారావు, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T23:53:00+05:30 IST