ప్రతి మనిషిపై అప్పుల కుంపటి పెట్టిన జగన్‌రెడ్డి
ABN , First Publish Date - 2023-02-02T22:43:25+05:30 IST
రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసి ప్రతి మనిషిపై సీఎం జగన్‌రెడ్డి అప్పుల కుంపటి పెట్టాడని టీడీపీ నాయకులు విమర్శించారు. మండల పరిధిలోని కృష్ణాపురంలో గురువారం రాత్రి ఇదేంఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు.
ఇదేం ఖర్మ కార్యక్రమంలో టీడీపీ నేతలు
కనిగిరి, ఫిబ్రవరి 2 : రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసి ప్రతి మనిషిపై సీఎం జగన్‌రెడ్డి అప్పుల కుంపటి పెట్టాడని టీడీపీ నాయకులు విమర్శించారు. మండల పరిధిలోని కృష్ణాపురంలో గురువారం రాత్రి ఇదేంఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయులపై కూడా జగన్‌రెడ్డి కక్ష సాధింపులకు దిగుతూ మానసిక వేదనకు గురిచేస్తున్నాడని విమర్శించారు. రెండు నెలలు గడుస్తున్నా కొన్ని శాఖల ఉద్యోగులకు ఇంతవరకు జీతాలు కూడా చెల్లించలేదన్నారు. 2 నెలలు జీతాలు ఇవ్వకపోతే వారు ఎలా జీవించాలని నిలదీశారు. ఇంత వరకు ఏ గ్రామంలో కూడా సరైన రోడ్డు వేసిన పాపాన పోలేదని విమర్శించారు. ఒక్క చాన్స్ అని అధికారాన్ని అప్పగిస్తే రాష్ట్ర ప్రజలకు నరకం చూపిస్తున్నాడని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు నంబుల వెంకటేశ్వర్లు, భేరి పుల్లారెడ్డి, ముచ్చుమూరి చెంచిరెడ్డి, గనగవరపు నాగిరెడ్డి, కృష్ణారెడ్డి, గ్రామ పార్టీ అఽధ్యక్షుడు గురవారెడ్డి, వెంకటరామిరెడ్డి, సత్యం, వెంకటరెడ్డి, యేసు ప్రభాకర్, గోపి, మల్లిఖార్జున, కాశయ్య, దేవసహాయం, లాజర్, ప్రభాకర్, రామయ్య, బాస్, రాంబాబు పాల్గొన్నారు.