సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
ABN , First Publish Date - 2023-03-19T02:10:29+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని అమరావతి జేఏసీ జిల్లా చైర్మన్ ఆర్‌వీఎస్ కృష్ణమోహన్ డిమాండ్ చేశారు.

ఉద్యోగుల ఆందోళన కొనసాగింపు
ఒంగోలు (కలెక్టరేట్), మార్చి 18 : ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని అమరావతి జేఏసీ జిల్లా చైర్మన్ ఆర్‌వీఎస్ కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. అమరావతి జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు శనివారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మండల కేంద్రాలతోపాటు పలు గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కొన్నిప్రాంతాల్లో ఉద్యోగులు కార్యాలయం ఎదుట నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒంగోలులోని జిల్లా పౌరసరసరాల శాఖ కార్యాలయంలో జరిగిన నిరసన కార్యక్రమంలో కృష్ణమోహన్‌తోపాటు ఏపీఆర్‌ఎస్‌ఏ కోశాధికారి జమ్మలమడుగు డానియేలు, డీఎస్‌వో కార్యాలయ సిబ్బంది పుల్లయ్య, సమి, రవి. జేమ్స్. ప్రశాంత్, ఇమ్మానియేల్ పాల్గొన్నారు.