చీకటి గదుల్లో ఇంటర్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2023-03-19T02:07:53+05:30 IST

ఇంటర్‌ పరీక్షా కేంద్రాలు కొన్నింటి లో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలి, వెలుతురు లేని చీకటి గదుల్లో పరీక్షలు నిర్వహిస్తుండటం పట్ల నిరసన తెలుపుతున్నారు.

చీకటి గదుల్లో ఇంటర్‌ పరీక్షలు

కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు

ఒంగోలు(విద్య), మార్చి 18 : ఇంటర్‌ పరీక్షా కేంద్రాలు కొన్నింటి లో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలి, వెలుతురు లేని చీకటి గదుల్లో పరీక్షలు నిర్వహిస్తుండటం పట్ల నిరసన తెలుపుతున్నారు. ఒంగోలులోని ఏబీఎం జూనియర్‌ కళాశాల పరీక్షా కేంద్రంలో విద్యార్థులు చీకటి గదు ల్లోనే పరీక్షలు రాస్తు న్నారు. పరీక్ష అనంతరం బయటకు వచ్చిన కొందరు తాము పడుతున్న ఇబ్బం దులను శనివారం ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. గత రెండు రోజులుగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి వల్ల ఆకాశం మేఘామృతం కావడంతో కళాశాలలోని పరీక్ష గదుల్లో చీకట్లు అలముకున్నాయి. మరుగుదొడ్లు దారుణంగా ఉండటంతో విద్యార్థినులు వాటిని వినియోగించుకొనే పరిస్థితి లేదు. దీంతో పరీక్ష ముగిసే వరకు ఉగ్గబట్టుకుని ఇళ్లకు వెళ్తున్నామని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులకు తగినంత ఫర్నిచర్‌ లేకపోవడంతో సప్లయి కంపెనీల్లో దొరికే బల్లులు, కుర్చీలు వేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఆ బల్లలు పరీక్షలు రాసేందుకు అనువుగా లేకపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వసతులు లేని కళాశాలలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేయడంపై పలువురు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-03-19T02:07:53+05:30 IST