బడ్జెట్ కేటాయింపుల్లో యువతకు అన్యాయం
ABN , First Publish Date - 2023-04-03T01:17:21+05:30 IST
వైసీపీ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో యువతకు అన్యాయం చేసిందని, ఉపాధి కల్పించడంలో జగన్ ప్రభు త్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జ్ ముత్తుముల అశోక్‌రెడ్డి విమర్శించారు.
గిద్దలూరు, ఏప్రిల్ 2 : వైసీపీ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో యువతకు అన్యాయం చేసిందని, ఉపాధి కల్పించడంలో జగన్ ప్రభు త్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జ్ ముత్తుముల అశోక్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ ్టమెంట్ సమ్మిట్ ఫేక్ పెట్టుబడులతో మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్ కేటా యింపుల్లో అంకెల గారడీ చేసి యువతను తప్పుదోవ పట్టించిందన్నారు. రాష్ట్రంలో 2018లో రాష్ట్రంలో 32.1 శాతం ఉన్న గ్రోత్ రేటు ఉందని , వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రస్తుతం 10.4 పడిపోయిందని విమర్శించారు. రానున్న ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ షాన్షావలి, నాయకులు బి.చంద్రశేఖర్, రంగనాథ్, గర్రె సాయి, పెద్దబాష కొండయ్యయాదవ్, రాఘవేంద్ర యాదవ్, దస్తగిరి, పాల్గొన్నారు.
కంభం : రాష్ట్రంలో వైసీపీ అసమ ర్ధ పాలనను ప్రజలు ఎదుర్కొంటు న్న సమస్యలను గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలుసుకున్నారు. ఆదివారం రాత్రి ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా అర్థవీడు మండలం అయ్యవారిపల్లె గ్రామం లో ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అసమర్ధ పాలన కొనసాగుతోందని వైసీపీ చేస్తున్న అరాచకాలతో ప్రజలు విసుగెత్తి పోయారన్నారు. కార్యక్రమంలో ఆంజనేయు లు, రంగారెడ్డి, నారాయణరెడ్డి, కిట్టయ్య, నారాయణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.