ఎస్‌.ఎన్‌.పాడు పంచాయతీలో అక్రమాలపై నేడు విచారణ

ABN , First Publish Date - 2023-03-20T00:09:28+05:30 IST

సంతనూతలపాడు గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం, స్థలాల ఆక్రమణపై పంచాయతీరాజ్‌శాఖ మంత్రి వద్ద సోమవారం విచారణ జరగనుంది. సాయంత్రం ఐదు గంటలకు వెలిగపూడిలోని సెక్రటేరియట్‌కు హాజరుకావాలని అప్పటి సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి, డీపీవోతోపాటు ఫిర్యాదుదారుడికి కూడా నోటీసులు అందాయి. పంచాయతీలో నిధుల దుర్వినియోగం, విలువైన స్థలాల ఆక్రమణలపై 2018లో సంతనూతలపాడుకు చెందిన కుంచాల వీరబ్రహ్మయ్య అప్పటి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

ఎస్‌.ఎన్‌.పాడు పంచాయతీలో   అక్రమాలపై నేడు విచారణ
ఎస్‌.ఎన్‌.పాడు పంచాయతీ కార్యాలయం (ఫైల్‌)

విచారణ నివేదికపై పీఆర్‌ మంత్రికి

అప్పీల్‌ చేసిన మాజీ సర ్పంచ్‌

ఒంగోలు (కలెక్టరేట్‌), మార్చి 19 : సంతనూతలపాడు గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం, స్థలాల ఆక్రమణపై పంచాయతీరాజ్‌శాఖ మంత్రి వద్ద సోమవారం విచారణ జరగనుంది. సాయంత్రం ఐదు గంటలకు వెలిగపూడిలోని సెక్రటేరియట్‌కు హాజరుకావాలని అప్పటి సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి, డీపీవోతోపాటు ఫిర్యాదుదారుడికి కూడా నోటీసులు అందాయి. పంచాయతీలో నిధుల దుర్వినియోగం, విలువైన స్థలాల ఆక్రమణలపై 2018లో సంతనూతలపాడుకు చెందిన కుంచాల వీరబ్రహ్మయ్య అప్పటి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో అప్పటి జిల్లా పంచాయతీ అధికారి సూచన మేరకు డివిజనల్‌ పంచాయతీ అధికారి విచారణ చేశారు. రూ.1.65 కోట్లు దుర్వినియోగమైనట్లు తేల్చారు. పంచాయతీకి చెందిన విలువైన స్థలాలు అన్యాక్రాంతమైనా పాలకవర్గంతోపాటు అప్పటి కార్యదర్శి పట్టించుకోలేదని డీఎల్పీవో నివేదిక ఇచ్చారు. అనంతరం దానిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బ్రహ్మయ్య ఉన్నతాధికారులకు, హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పటి సర్పంచ్‌ అంకారావు పంచాయతీరాజ్‌శాఖ మంత్రికి అప్పీల్‌ చేసుకున్నారు. ఈ అప్పీల్‌పై మంత్రి విచారణ చేయనున్నారు. సోమవారం విచారణకు హాజరుకావాలని అప్పటి సర్పంచ్‌ అంకారావు, పంచాయతీ కార్యదర్శి, ఫిర్యాదుదారుడు బ్రహ్మయ్యతోపాటు జిల్లా పంచాయతీ అధికారికి నోటీసులు అందాయి. అందుకు సంబంధించిన రికార్డులను జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి తీసుకెళ్లనున్నారు.

Updated Date - 2023-03-20T00:09:28+05:30 IST