రెస్టారెంట్లలో విచ్చలవిడిగా మద్యం అక్రమ అమ్మకాలు

ABN , First Publish Date - 2023-05-25T23:48:41+05:30 IST

కొండపి ప్రాంతంలో జోరుగా రెస్టారెంట్లు, బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. మద్య నియంత్రణ పేరుతో ప్రభుత్వం తీసుకువచ్చిన విధానాలు దాన్ని నియంత్రించలేక పోయా యి. నిర్ణీత వేళల పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలు నడుస్తున్నాయి.

రెస్టారెంట్లలో విచ్చలవిడిగా మద్యం అక్రమ అమ్మకాలు
కొండపిలోని మద్దులూరు రోడ్డులోని రెస్టారెంట్‌లో ఉదయం 7 గంటలకే మద్యం తాగుతున్న చిరువ్యాపారులు

గ్రామాల్లో జోరుగా బెల్టుషాపులు

క్వార్టర్‌కు వంద రూపాయలు అదనంగా అమ్మకం

కొండపి, మే 25: కొండపి ప్రాంతంలో జోరుగా రెస్టారెంట్లు, బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. మద్య నియంత్రణ పేరుతో ప్రభుత్వం తీసుకువచ్చిన విధానాలు దాన్ని నియంత్రించలేక పోయా యి. నిర్ణీత వేళల పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. అయితే ప్రభుత్వ మద్యం దుకాణాలు మూత అనంతరం ప్రైవేటు బెల్టు షాపులు, రెస్టారెంట్లలో జోరుగా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ప్ర భుత్వ మద్యం దుకాణాల నుంచి క్వార్టర్‌కు పది రూపాయలు ఇచ్చి వందల సంఖ్యలో మద్యం సీసాలు తెచ్చుకుంటున్న రెస్టారెంట్లు, బెల్టుషాపుల నిర్వాహకులు ప్రతి క్వార్టర్‌ సీసాకు వంద రూపాయలు అదనంగా ధర పెం చి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. 180 ఎంఎల్‌ తాగేవారికి లూజు మద్యంలో నీళ్లు కలపడంతోపాటు, ఇతర తక్కువ రకం ఆల్కాహాలిక్‌ స్పిరిట్‌లను కలిపి విక్రయిస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. ఉద యం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్ర భుత్వ మద్యం దుకాణాలు నడుస్తుండగా, ప్రతి రోజూ వేకువ జాము నుంచే రెస్టారెంట్లు, బెల్టుషాపులు యథేచ్ఛగా మద్యాన్ని విక్రయిస్తున్నాయి. నియోజకవర్గ కేంద్రమైన కొండపిలో ఐదు రెస్టారెంట్లు నడుస్తుండగా, వీటితోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో దొంగచాటుగా మద్యం బెల్టు షాపులు సాగుతున్నాయి. ప్రధానంగా ప్ర భుత్వ దుకాణాలు మూసి వేసిన వేళల్లో రెస్టారెంట్లు, బె ల్టుషాపుల్లో మద్యం అదనపు ధరకు విక్రయాలు సాగిస్తున్నారు. కొండపిలోని మద్దులూరు రోడ్డులో ప్రభుత్వ దుకాణంను ఆసరాగా చేసుకుని వెనుకవైపు మందు బాబులకు సిట్టింగ్‌ పాయింట్‌ ఏర్పాటు చేసి నడుపుతుండటం విశేషం. అక్రమంగా మద్యం విక్రయాలపై పోలీసు, సెబ్‌ అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

ఎక్కడ పడితే అక్కడే..

మందు బాబులు మద్యాన్ని కొనుగోలు చేశాక ఎక్కడ పడితే అక్కడే తాగుతున్నారు. దీనికితోడు గ్రామాల్లో కూడా బెల్టుషాపులు, సిట్టింగ్‌ పాయింట్లుగా మారాయి. బడ్డీ కొట్ల వద్దనే మద్యం విక్రయదారులు ఏర్పాటు చే స్తున్నారు. జరుగుమల్లి మండలంలోని కె. బిట్రగుంట గ్రామ శివాలయం ఆనుకుని బెల్టు దుకాణం నడుస్తున్నదని, మందు బాబుల ఆగడాల కారణంగా శివాలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. అదేవిధంగా జరుగుమల్లి, పొన్నలూరు మండలాల్లోని గ్రామాల్లో యథేచ్ఛగా బడ్డీ కొ ట్లలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయని, మద్యం నియంత్రణ పోయి మద్యం విక్రయాలు, తాగుబోతుల ఆగడాలు పెరిగాయ ప్రజలు వాపోతున్నారు. రెస్టారెంట్లలో మద్యం విక్రయాలతో పాటు బెల్టుషాపులు మూసి వేయించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2023-05-25T23:48:41+05:30 IST