ప్రజాదరణను చూసి ఓర్వలేకే అక్రమ కేసులు

ABN , First Publish Date - 2023-09-26T00:32:07+05:30 IST

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు సభలకు వస్తున్న ఆదరణతోపాటు జాతీయ కార్యదర్శి లోకేష్‌ చేస్తున్న యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేకే చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొర్రపాటి వసంతరాయుడు విమర్శించారు. కొండపిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన రిలే దీక్ష ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు.

ప్రజాదరణను చూసి ఓర్వలేకే అక్రమ కేసులు
రిలే దీక్షలో మాట్లాడుతున్న పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొర్రపాటి వసంతరాయుడు

చంద్రబాబు అరెస్టుపై పార్టీ కార్యాలయంలో కొనసాగిన రిలే దీక్ష

కొండపి, సెప్టెంబరు 25 : టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు సభలకు వస్తున్న ఆదరణతోపాటు జాతీయ కార్యదర్శి లోకేష్‌ చేస్తున్న యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేకే చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొర్రపాటి వసంతరాయుడు విమర్శించారు. కొండపిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన రిలే దీక్ష ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పార్టీ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అవన్నీ కోర్టులో కొట్టివేయడం ఖాయమన్నారు. రిలేదీక్షలో పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డపాటి యల్లమందనాయుడు, నాయకులు తిప్పారెడ్డి కృష్ణారెడ్డి, గుండపనేని రామ్మూర్తినాయుడు, దామా మురళి, చింతల వెంకటరావు, కొమ్మాలపాటి రాఘవరావు, కందిమళ్ల లక్ష్మీనారాయణ, వేముల మల్లికార్జున, కల్లూరి మల్లికార్జున, చింతలపూడి లక్ష్మీనారాయణ, కొల్లా మోహన్‌, నన్నూరి సుబ్బరామయ్య, బూదవాటి సోమయ్య, ఈదర కిరణ్‌కుమార్‌, తెలుగు యవత మండల అధ్యక్షుడు షేక్‌ ఖాఈషా, కట్టావారిపాలెం తెలుగు యువత నాయకుడు రాంబాబు, ఎస్సీ సెల్‌ నాయకులు యనమద్ని వెంకటేశ్వర్లు, దర్నాశి వసంతరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T00:32:07+05:30 IST