ఘనంగా మేడే
ABN , First Publish Date - 2023-05-02T01:02:41+05:30 IST
జిల్లావ్యాప్తంగా సోమవారం ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
వాడవాడలా ఎర్రజెండా రెపరెపలు
ఒంగోలు(కలెక్టరేట్), మే 1 : జిల్లావ్యాప్తంగా సోమవారం ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ప్రధాన పట్టణాలతోపాటు మండల కేంద్రాలు, ముఖ్యమైన గ్రామాల్లో వివిధ పార్టీలు, వాటి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మేడే ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. ఒంగోలులో సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, ఇతర నాయకులు పాల్గొన్నారు. సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు పూనాటి ఆంజనేయులు, జాలా అంజయ్య పాల్గొన్నారు. అదేవిధంగా వైసీపీ, టీడీపీల ఆధ్వర్యంలో వారి కార్యాలయాల వద్ద జెండా ఆవిష్కరణలు చేశారు. ఎస్‌ఎన్‌పాడులో జరిగిన వేడుకల్లో టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు. పామూరు, కనిగిరి, దర్శి, మార్కాపురం, వైపాలెం, గిద్దలూరు, కంభం తదితర ప్రాంతాల్లో మేడే కార్యక్రమాలు జరిగాయి. చీమకుర్తితోపాటు గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీల వద్ద కార్మికులు జెండాలను ఆవిష్కరించి సభలు నిర్వహించారు.