జీపీఎస్‌ రద్దు చేయాలి

ABN , First Publish Date - 2023-09-25T23:28:03+05:30 IST

ప్రభుత్వం కొత్తగా తెచ్చిన గ్యారంటీ పెన్షన్‌ స్కీం(జీపీఎ్‌స)ను రద్దుచేసి పాత పెన్షన్‌ స్కీంను అమలు చేయాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ డి.శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా నిర్వహించారు.

జీపీఎస్‌ రద్దు చేయాలి
కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు

పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ

కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 25: ప్రభుత్వం కొత్తగా తెచ్చిన గ్యారంటీ పెన్షన్‌ స్కీం(జీపీఎ్‌స)ను రద్దుచేసి పాత పెన్షన్‌ స్కీంను అమలు చేయాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ డి.శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా నిర్వహించారు. ధర్నాలో శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం తెచ్చిన జీపీఎ్‌సను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మ రింత ఉధృతం చేయాల్సి వస్తోందని హెచ్చరించారు. గత ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలో కి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తర్వాత వా టిని విస్మరించారన్నారు. ఫ్యాప్టో నాయకుడు కో మ్మోజి శ్రీనివాసరావు మా ట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు చేసేందుకు కూడా ప్రభుత్వం అనుమతించకపోవడం దారుణంగా ఉందన్నారు. ఈ విధానాలను ఉపసంహరించుకోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కే.ఎర్రయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ముందస్తు అరెస్టులు, అక్రమ కేసులు పెడుతూ భయబ్రాతులకు గురిచేసే విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. పర్రె వెంకట్రావు, వై.శ్రీనివాసులు, ఎస్‌ఎండీ రఫీ, టీఎన్‌యూఎ్‌స రాష్ట్ర అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్‌, బత్తిన ప్రసాద్‌, రఘబాబు తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలతోనే ఉపాధ్యాయులు రోడ్డు మీదకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పాత పెన్షన్‌ విధానాన్ని అమలుచేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో ప్రతినిధులు కేవిజి.కీర్తి, ఉమామహేశ్వరి, వాకా జనార్దన్‌రెడ్డి, టి .ఆంజనేయులు, బి. అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-25T23:28:03+05:30 IST