ప్రభుత్వ పథకాలను ప్రజల దరికి చేర్చాలి

ABN , First Publish Date - 2023-06-02T23:00:50+05:30 IST

ప్రభుత్వం అందించే పథకాలు ప్రజల దరికి చేర్చేలా వివిధ శాఖల అధికారులు చొరవ వహించాలని నియోజకవర్గ స్పెషల్‌ అధికారి, జిల్లా ఉద్యానవనాధికారి గోపిచంద్‌ అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం వివిధ శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు నేడు పఽథకం ద్వారా జరుగుతున్న స్కూల్‌ నిర్మాణాల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వ పథకాలను ప్రజల దరికి చేర్చాలి
సమావేశంలో మాట్లాడుతున్న స్పెషల్‌ ఆఫీసర్‌ గోపిచంద్‌

కనిగిరి, జూన్‌ 2: ప్రభుత్వం అందించే పథకాలు ప్రజల దరికి చేర్చేలా వివిధ శాఖల అధికారులు చొరవ వహించాలని నియోజకవర్గ స్పెషల్‌ అధికారి, జిల్లా ఉద్యానవనాధికారి గోపిచంద్‌ అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం వివిధ శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు నేడు పఽథకం ద్వారా జరుగుతున్న స్కూల్‌ నిర్మాణాల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన అన్ని తరగతుల పుస్తకాలను నూరు శాతం విద్యార్థులకు అందించేలా విద్యాశాఖాధికారులు చొరవ వహించాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాలనీల నిర్మాణాల పనులు లబ్దిదారులు త్వరతిగతిన పూర్తి చేసేలా గృహనిర్మాణశాఖాధికారులు పర్యవేక్షణ వహించాలన్నారు. ఇల్లు కట్టుకోకుండా ఉన్న లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసి విముఖత ఉన్న వారి పేర్ల పట్టాలను రద్దు చేసి అర్హులైన వారికి పట్టాలు అందచేయాలని ఆదేశించారు. ఉపాధిహామీ పథకం ద్వారా జరుగుతున్న పనుల వివరాలను సంబంధిత శాఖాధికారులను అడిగి తెలుసుకున్నారు. పేదలకు వంద రోజుల పనిదినాలే లక్ష్యంగా అధికారులు పనులు కల్పించాలని సూచించారు. సమావేశంలో పాల్గొన్న ఎంపీపీ దంతులూరి ప్రకాశం మాట్లాడుతూ చాకిరాల వద్ద ఇచ్చిన జగన్‌కాలనీకి కేటాయించిన భూమిపై ప్రస్తుతం కోర్టు వివాదంలో ఉందని, దీంతో లబ్ధిదారుల ఆశలు ఆవిరై పోయాయన్నారు. అందుకోసం లబ్ధిదారులు ఇబ్బందుల దృష్ట్యా చాకిరాల వద్ద ఉన్న టిడ్కో ఇళ్ల సమీపంలో 4ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని, ఆ భూమిలో లబ్ధిదారులకు ఇళ్ల ప్లాట్లను కేటాయించాలని ఎంపీపీ స్పెషల్‌ ఆఫీసర్‌ను కోరారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా సర్వేనెంబరు 29లో ఉన్న ఒకే భూమికి ఇద్దరికి పట్టాలు ఇచ్చారని, వారికి తగిన న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా కనిగిరి ఉద్యానశాఖాధికారి కార్యాలయానికే రావటం లేదని వారి స్థానంలో మరొకరిని నియమించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీవో మల్లికార్జునరావు, కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2023-06-02T23:00:50+05:30 IST