వైభవంగా శ్రీరామచంద్ర స్వామి, ధ్వజస్తంభ ప్రతిష్ఠ
ABN , First Publish Date - 2023-06-02T00:55:10+05:30 IST
మండలంలోని రాగ సముద్రంలో శ్రీసీతాలక్ష్మణ హనుమంత సమేత శ్రీరామచంద్రస్వామి, జీవధ్వజ శిఖర కలిశ ప్రతిష్ఠ మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది.
తర్లుపాడు, జూన్ 1: మండలంలోని రాగ సముద్రంలో శ్రీసీతాలక్ష్మణ హనుమంత సమేత శ్రీరామచంద్రస్వామి, జీవధ్వజ శిఖర కలిశ ప్రతిష్ఠ మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. వేదపండితులు ఓరుగంటి సీతారామ శర్మ, రాచర్ల శ్రీనివాసాచారి వారి ఆధ్వర్యంలో ప్రాతఃకాలపూజ, ప్రతి ష్ఠ హోమం, శాంతిపౌష్టిక హోమా లు గర్తపూజ, యంత్ర ప్రతిష్ఠ, విగ్ర హ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, శిఖర, కలిశ ప్రతిష్ఠ, ధ్వజస్తంభం ప్రతిష్ఠ, శాంతి కళ్యాణం కార్య క్రమాలు నిర్వహించారు. ప్రతిష్ఠ మహోత్సవం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ వారి ఆర్థిక సహాయంతో సమరసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుడి నిర్మించి కార్యక్రమం నిర్వహించారు. ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిల కించేందుకు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిం చారు. ఈ సందర్భంగా భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.