శాసనాల తోట వేములకోట

ABN , First Publish Date - 2023-01-13T00:48:35+05:30 IST

మార్కాపురం మండలం వేములకోటలో తెలుగుభాషకు సంబంధించిన శాసనాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి.

శాసనాల తోట వేములకోట

మార్కాపురం, జనవరి 12 : మార్కాపురం మండలం వేములకోటలో తెలుగుభాషకు సంబంధించిన శాసనాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. చరిత్ర పరిశోధకుడు జంకె నారాయణరెడ్డి తొలుత వేములకోటలోని వేములమ్మ గుడిలో, గుడికి అర కిలోమీటర్‌ దూరంలో రోలుబండపై ఉన్న శాసనాలను గుర్తించారు. ఆ విషయాన్ని చర్రిత పరిశోఽ దకులు రెడ్డి రత్నాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆ శాసనాలను అచ్చు వేసి ఆర్కిలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో ఏపిగ్రఫిస్ట్‌ డాక్టర్‌ ముని రత్నంకు పంపారు. ఆయన పరిశోధను పూర్తి చేసిన అనంతరం ఆ శాసనాలకు సంబంధించి పలు విషయాలను వెల్లడించారు. ఆయన వెల్లడించిన వివరాల మేరకు వేములకోట పరిధిలో రోలుబండపై ఉన్న శాసనం 8వ శతాబ్దానికి చెందినది. అది తెలుగు భాష తొలినాళ్లకు చెందిన (అర్య-యోధుడు) వీర మరణం చెందిన కారణంగా రాచయరావు ల(చోళ) ఒక స్మారక శిలను ఏర్పాటు చేశా రు. ఆ శిలాశాసనంలో రేచస అనే వ్యక్తి ప్రస్థావన ఉంది. ఆ శాసనంలో గుండి అనే నది పేరు ఉంది. గుండ్లకమ్మను పూర్వం గుండినదిగా పిలిచేవారని తెలుస్తోంది. చెన్న కేశవస్వామి మేనత్త వేములమ్మగా భావించే అమ్మవారి గుడిగోడపై ఒక వీరుడు కుడి చేతి లో కత్తితో ఉన్న శిలను గుర్తించారు. దేవస్థానంలో గోడపై 8వ శతాబ్దపు తెలుగు భాషలో రాసిన శాసనంలో శింగరాజుల పట్ట అని ఉంది. ఈ ఆలయానికి సింహరాజు ఇచ్చి న పలకను బహుమతిగా నమోదు చేసిన ట్లుంది. ఈ శిలాఫలకాన్ని వీరగట్టు అంటారు. రాజ్య రక్షణలో భాగంగా మరణించిన వీరుల జ్ఞాపకార్థం ఇటువంటి శిల్పాలను ప్రతిష్ఠ స్తారని చరిత్రకారుల సమాచారం.

Updated Date - 2023-01-13T00:49:36+05:30 IST