Share News

6నుంచి జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన

ABN , Publish Date - Dec 31 , 2023 | 10:51 PM

సంక్రాంతి పండుగ సందర్భంగా జనసేన పార్టీ, గరికపాటి చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలను ఈనెల 6వ తేదీ నుంచి దర్శిలో నిర్వహిస్తున్నట్లు దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు గరికపాటి వెంకట్‌ తెలిపారు. జనవరి 6 నుంచి 9వ తేదీ వరకు నాలుగు రోజులు పాటు నాలుగు కేటగిరీ ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.

6నుంచి జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన

దర్శి, డిసెంబరు 31 : సంక్రాంతి పండుగ సందర్భంగా జనసేన పార్టీ, గరికపాటి చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలను ఈనెల 6వ తేదీ నుంచి దర్శిలో నిర్వహిస్తున్నట్లు దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు గరికపాటి వెంకట్‌ తెలిపారు. జనవరి 6 నుంచి 9వ తేదీ వరకు నాలుగు రోజులు పాటు నాలుగు కేటగిరీ ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ పోటీల్లో 6వ తేదీ నాలుగు పళ్ల విబాగం ఎడ్లు, 7వ తేదీన ఆరు పళ్ల విభాగం ఎడ్లు, 8వ తేదీ న్యూ క్యాటగిరీ ఎడ్లు, 9వ తేదీ సీనియర్‌ క్యాటగి రీ ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపోందిన సీనియర్‌ కేటగిరి ఎడ్ల విజేతల కు ప్రథమ బహుమతిగా మహేంద్ర 475 డీఐ ట్రాక్టర్‌, రెండవ బహుమతిగా రూ.1.50 లక్షలు, మూడవ బహుమతి గా రూ.1.20 లక్షలు, నాల్గవ బహుమతిగా రూ.లక్ష, ఐదవ బహుమతిగా రూ.20 వేలు, ఆరవ బహుమతిగా రూ.70 వేలు, ఏడవ బహుమతి రూ.60 వేలు, 8వ బహుమతిగా రూ.50వేలు, తొమ్మిదవ బహుమతి రూ.40 వేలు అందించటం జరుగుతుందన్నారు. న్యూ క్యాటగిరీ విభాగంలో గెలుపొందిన ఎడ్లకు ప్రథమ బహుమతిగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ మోటార్‌ సైకిల్‌, రెండవ బహుమతిగా రూ.90వేలు, మూడవ బహుమతిగా రూ.80 వేలు, నాల్గవ బహుమతిగా రూ.70 వేలు, ఐదవ బహుమతిగా రూ.60 వేలు, ఆరవ బహుమతిగా రూ.50 వేలు, ఏడవ బహుమతిగా రూ.40 వేలు, ఎనిమిదవ బహుమతిగా రూ.30 వేలు, తొమ్మిదవ బహుమతిగా నైజ20వేలను అందజేస్తారు. ఆరుపళ్ల విభాగంలో విజేతలకు వరుసగా ప్రథమ రూ.60వేలు, ద్వితీయ రూ.50వేలు, తృతీయ రూ.40వేలు, చతుర్థ రూ.30 వేలు, పంచమ రూ.25వేలు, ఆరవ రూ.20వేలు, ఏడవదిగా రూ.15 వేలు, ఎనిమిదవ రూ.10వేలు, తొమ్మిదవ బహుమతిగా రూ.10వేలు, నాలుగు పళ్ల విభాగంలో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.50వేలు, ద్వితీయ రూ.40వేలు, మాడవ రూ.30వేలు, నాల్గవ బహుమతి రూ.25వేలు, ఐదవ రూ.20వేలు, ఆరవ రూ.18వేలు, ఏడవ రూ.15 వేలు, ఎనిమిదవ రూ10వేలు, తొమ్మిదవ బహుమతిగా రూ.8వేలు అందిస్తున్నారు. పోటీల్లో పాల్గొన్న నాల్గుపళ్ల ఎడ్లకు, ఆరుపళ్ల ఎడ్లకు రూ.6వేలు చొప్పున బహుమతులు, న్యూ క్యాటగిరీ, సీనియర్‌ జతల ఎడ్లకు రూ.10వేల చొప్పున కన్సొలేషన్‌ బహుమతులు అందించడం జరుగుతుందని గరికపాటి వెంకట్‌ వివరించారు.

Updated Date - Dec 31 , 2023 | 10:51 PM