రహదారి నిబంధనలు పాటించాలి
ABN , First Publish Date - 2023-03-05T01:49:00+05:30 IST
డ్రైవర్లతో పాటు వివిధ వాహనదారులు రహ దారి సూత్రాలు పాటించాలని 6వ అదనపు జిల్లా జడ్జీ టి.రాజావెంకటాద్రి అన్నారు.
మార్కాపురం(వన్‌టౌన్), మార్చి 4: డ్రైవర్లతో పాటు వివిధ వాహనదారులు రహ దారి సూత్రాలు పాటించాలని 6వ అదనపు జిల్లా జడ్జీ టి.రాజావెంకటాద్రి అన్నారు. స్థానిక ఎస్‌వీకేపీ కళాశాలలో శనివారం మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యం లో ఆటోకార్మికులు, డ్రైవర్లకు న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా జడ్జి రాజావెంకటాద్రి మాట్లాడుతూ రాజ్యంగబద్ధ చట్టాలు పేదలకు న్యాయపరమైన అంశాలు ఉచితం గా సేవలు అందించేందుకు ఈ సదస్సు ఏర్పాటు చేశామన్నారు. మద్యం సేవించి, మొబైల్ మాట్లాడుతు డ్రైవింగ్ చేయరాదన్నారు. విలువైన ప్రాణాలు మీ చేతల్లో ఉన్నాయన్న విషయం గుర్తించు కోవాలన్నారు. ఆటో నడుపుకుంటూ డ్రైవింగ్ లైసెన్స్‌లేని వారిని గుర్తించిన జడ్జి అర్హత ఉన్న వారందరికీ లైసెన్సులు ఇవ్వాలని మోటార్ వెహికల్ అధికారులను ఆదేశిం చారు. మరో న్యాయమూర్తి ఆదినారా యణ మాట్లాడుతూ.. సత్ప్రవర్తన నైతిక విలువలతో జీవించాలన్నారు. నిత్యం జరుగు తున్న రోడ్డు ప్రమాదాలతో అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. ప్రమాదాలను నివారిం చేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌డీవో అమర్‌నాయక్, ఎంవీఐ మాధవరావు, పట్టణ ఎస్‌ఐ శశికుమార్, బార్‌అసోసియేన్ అధ్యక్షు డు కంది నారాయణరెడ్డి పాల్గొన్నారు.