ఫ్యాన్‌ రెక్కలు ముక్కలు..!

ABN , First Publish Date - 2023-03-18T22:41:53+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. సైకిల్‌ వేగానికి ఫ్యాన్‌ రెక్కలు ముక్కలయ్యాయని టీడీపీ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కమిటీ ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి ప్రభాకర్‌చౌదరి తెలిపారు.

ఫ్యాన్‌ రెక్కలు ముక్కలు..!
దొనకొండలో మండలం మల్లంపేటలో విజయోత్సవర్యాలీ నిర్వహిస్తున్న శ్రేణులు

పామూరు, మార్చి 18 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. సైకిల్‌ వేగానికి ఫ్యాన్‌ రెక్కలు ముక్కలయ్యాయని టీడీపీ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కమిటీ ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి ప్రభాకర్‌చౌదరి తెలిపారు. శనివారం టీడీపీ కార్యాలయంలో బీఎంసీ మృతికి మౌనం పా టిం చారు. ఈ విజయం బీఎంసీకే అంకితమన్నారు. అనంతరం బాణసంచా కాల్చుతూ మిఠాయిలు పంచి పె ట్టారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌చౌదరి మాట్లాడుతూ ఈ ఎన్నికల స్ఫూర్తితో రానున్న అసెంబ్లీ ఎన్నిక ల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబును, కనిగిరి ఎమ్మెల్యేగా డాక్టర్‌ ఉగ్రను గెలిపించుకోవాలన్నారు. టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఆంధ్రుల ఏకైకా రాజధాని అమ రావతి అని ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఓటుతో ప్రజలు వైసీపీకి గట్టి బుద్ధి చెప్పారన్నారు. ఎమ్మె ల్సీగా కంచర్ల శ్రీకాంత్‌ గెలుపునకు సహకరించిన పట్టబధ్రులను, టీడీపీ బూత్‌ ఇన్‌చార్జిలు, నాయకులు, కా ర్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కనిగిరిలో ఉగ్ర నిర్వహించిన కార్యక్రమానికి పలు వురు టీడీపీ శ్రేణులు తరలివెళ్లారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యలు వైఎస్‌ ప్రసాద్‌రెడ్డి సయ్యద్‌ అమీర్‌బాబు, ఆర్‌ఆర్‌ రఫి, పట్టణ అధ్యక్షుడు ఖాజారహంతుల్లా, ఉప్పలపాటి హరిబాబు, పాలపర్తి వెంక టేశ్వర్లు, రమణయ్య, డోలా శేషు, నాగరాజు, పువ్వాడి వెంకట్‌చౌదరి, యాదాల మాలకొండయ్య, ఎన్‌సాంబ య్య, రామారావు, కమ్మ బాలకృష్ణ, ఎన్‌ నాగేంధ్రచారి, వెంకటేశ్వర్లు, డి.శంకర్‌, డి మాధవరావు, సత్యం, మహేష్‌ రసూల్‌, రమణయ్య, రమాదేవి, ఈశ్వరమ్మ, రమణమ్మ, నాగమణి పాల్గొన్నారు.

దొనకొండ : టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌తో పాటు మరో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ గెలుపు పట్ల టీ డీపీ నాయకులు వల్లపునేని వెంకటస్వామి, వడ్లమూడి చెన్నయ్యల నేతృత్వంలో మల్లంపేట గ్రామంలో శని వారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నాయ కు లు, కార్యకర్తలు ఉత్సాహంగా గులాములు చల్లుకుం టూ, బాణసంచా పేల్చారు. కార్యక్రమంలో రుద్రసము ద్రం సర్పంచ్‌ అల్లూరయ్య, నాయకులు కామేపల్లి చెంచ య్య, వల్లపునేని కేశవ, దుగ్గెంపూడి కోటయ్య, పత్తి సుబ్బారావు పాల్గొన్నారు.

పీసీపల్లి : టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయంపట్ల శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మండలంలోని చిరుకూరివారిపల్లిలో తెలుగు యువత ఆధ్వర్యంలో రంగులు చల్లుకుని బాణసంచా కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వేమూరి రామయ్య తెలుగుయువత మండల అధ్యక్షుడు నాగేంద్రబాబు, గ్రామ కమిటీ అధ్యక్షుడు మాల్యాద్రి, ఉపసర్పంచ్‌ వీరనారాయణ, వీరయ్య, వెంకట్రావు, రమణయ్య, మోహన్‌రావు, మాలకొండయ్య, తిరుపతయ్య, సుబ్బరాయుడు పాల్గొన్నారు.

ముండ్లమూరు : ఎమ్మెల్సీలుగా కంచర్ల శ్రీకాంత్‌, వేపాడ చిరంజీవిరావు, భూమిరెడ్డి రాంమభూపాల రెడ్డిలను గెలిపించిన ప్రజలకు టీడీపీ మండల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శంకరాపురంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి మాజీ ఎంపీపీ మందలపు వెంకట్రావు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం కేక్‌కట్‌ చేసి తినిపించారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు శ్రీనివాసరావు, సర్పంచ్‌ నారాయణస్వామి, గ్రామాధ్యక్షుడు పూర్ణయ్య, రాంబాబు, విశ్రాంత ఎస్‌ఐ ఆంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T22:41:53+05:30 IST