ఎక్స్‌ప్రెస్ చార్జీ.. పల్లెవెలుగు బస్సు
ABN , First Publish Date - 2023-12-11T22:59:45+05:30 IST
కార్తీక మాసంలో పంచారామ దేవాలయాల దర్శనం పేరుతో ఆర్టీసీ బస్సులు ఏర్పాటుచేశారు. ప్రతి ఆదివారం రాత్రి బయలుదేరి సోమవారం రోజు ఐదు శైవ క్షే త్రాలు దర్శనం అన ంతరం మంగళవారం ఉదయానికి ఆయా డిపోలకు చేరేలా బస్సులు ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా అద్దంకి డిపో నుంచి ఆది వారం రాత్రి పంచారామాల దర్శనానికి ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఎక్స్‌ప్రెస్ బస్ ఏర్పాటుచేసేవిధంగా ఒక్కొక్కరి నుం చి రూ.1800 వసూలు చేశారు. తీరా బయలుదేరే సమయానికి ఎక్స్ ప్రెస్ బస్ స్థానంలో పల్లెవెలుగు బస్సు ఏర్పాటుచేశారు. దీంతో ప్రయా ణికులు ఖంగుతిన్నారు.
ఆందోళనకు దిగిన మహిళా ప్రయాణికులు
చివరకు డబ్బులు వెనక్కి ఇచ్చిన ఆర్టీసీ అధికారులు
అద్దంకి, డిసెంబరు 11: కార్తీక మాసంలో పంచారామ దేవాలయాల దర్శనం పేరుతో ఆర్టీసీ బస్సులు ఏర్పాటుచేశారు. ప్రతి ఆదివారం రాత్రి బయలుదేరి సోమవారం రోజు ఐదు శైవ క్షే త్రాలు దర్శనం అన ంతరం మంగళవారం ఉదయానికి ఆయా డిపోలకు చేరేలా బస్సులు ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా అద్దంకి డిపో నుంచి ఆది వారం రాత్రి పంచారామాల దర్శనానికి ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఎక్స్‌ప్రెస్ బస్ ఏర్పాటుచేసేవిధంగా ఒక్కొక్కరి నుం చి రూ.1800 వసూలు చేశారు. తీరా బయలుదేరే సమయానికి ఎక్స్ ప్రెస్ బస్ స్థానంలో పల్లెవెలుగు బస్సు ఏర్పాటుచేశారు. దీంతో ప్రయా ణికులు ఖంగుతిన్నారు. సుదూర ప్రాంతం సుమారు 20 గంటల పాటు పల్లెవెలుగు బస్సులో ఎలా ప్రయాణించాలని ప్రశ్నించారు. ఈవిషయం లో ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారించారని ప్రయాణికు లు ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి సమయంలో మహిళలు, పిల్లలతో బస్టాండ్‌లో ఉండాల్సి వచ్చిందని ఆందోళనకు దిగారు. యాత్రకు వచ్చి నా, రాకున్నా డబ్బులు వెనక్కి ఇచ్చేది లేదని అధికారులు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పల్లెవెలుగు బస్సులో ప్రయాణించేం దుకు విముఖత చూపిన యాత్రికులకు నగదు వెనక్కి ఇవ్వటంతో వి వాదం సద్దుమణిగింది. మిగిలిన ప్రయాణికుల వద్ద కూడా టిక్కెట్ ధర తగ్గించి తీసుకోవటంతో యాత్రికులు కూడా ఒకింత సంతృప్తి వ్యక్తం చేశారు. ఈవిషయమై డీఎం రామ్మోహనరావును వివరణ కోరగా ఎక్కువ మంది ప్రయాణికులు పల్లెవెలుగు బస్సులో వెళ్ళేందుకు ఇష్టపడటంతో చార్జీ తగ్గించి పల్లెవెలుగు బస్సును పంపినట్టు చెప్పారు. ఇష్టపడని ప్ర యాణికులకు నగదు వెనక్కి ఇచ్చినట్టు తెలిపారు.