ఉపాధి నిధులు రాళ్లపాలు

ABN , First Publish Date - 2023-05-02T23:10:13+05:30 IST

ఉపాధి హమీ ప థకం నిధులు రాళ్లుపాలు చేశారు. గ్రామా ల్లో జరిగిన పనుల వివరాలను నమోదు చేసి పని ప్రదేశంలో వాటిని ఏర్పాటుచే యాలి. అయితే, ఈరాళ్లను సంవత్సరాల త రబడి మూలనపడేశారు.

ఉపాధి నిధులు రాళ్లపాలు
ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉన్న రాళ్లు

సమాచార బోర్డుల పేరుతో నాపరాళ్లు కోనుగోలు

మూలనపడేసిన వైనం

అద్దంకి టౌన్‌, మే 2: ఉపాధి హమీ ప థకం నిధులు రాళ్లుపాలు చేశారు. గ్రామా ల్లో జరిగిన పనుల వివరాలను నమోదు చేసి పని ప్రదేశంలో వాటిని ఏర్పాటుచే యాలి. అయితే, ఈరాళ్లను సంవత్సరాల త రబడి మూలనపడేశారు. వేల రూపాయ లు పెట్టి కోనుగోలు చేసి ఉపయోగించకుం డా నిరుపయోగంగా పడవేశారు. దీంతో ఉపాధి హమీ పథకం నిధులు రాళ్లపాలు అయ్యాయని పలువురు విమర్శిస్తున్నారు.

గ్రామాల్లో జరిగే ఉపాధి హమీ పథకం పనులకు సంబంధించి ఆయా ప్రదేశాల్లో పనుల వివరాలతో సమాచార బోర్డులను ఏర్పాటుచేయాలి. అయితే, అద్దంకి మండలంలో వాటిని ఏర్పాటుచేయకుండా ఎంపీడీవో కార్యాలయం వెనుక వైపు, వెలుగు ఆఫీస్‌ ముందు, ఎన్‌ఎ్‌సపీ కాలనీలో ఈ రాళ్లను గు ట్టలు గుట్టలుగా చెట్లకు, గోడలకు ఆనించి పెట్టి ఉన్నాయి. అధికారు లు మాత్రం ఈ ఏడాదివే అని చెబుతున్నా, వాటిపై ఉన్న వివరాలను పరిశీలిస్తే సుమారు మూడేళ్ల నుంచి జరిగిన ఉపాధి హమీ పథకం పనులకు సంబంధించిన పనుల సమాచారం తెలిపే వివరాలు ఆ రాళ్లపై రాసి ఉన్నాయి. మూడేళ్లగా పని ప్రదేశాలలో ఏర్పాటు చేయాల్సిన సమాచార రాళ్లను పెట్టకుండా వాటిని నిరుపయోగంగా ఇక్కడే పడవేశారు. వేలకు వేలు నిధులు వెచ్చించి వాటిని కోనుగోలు చేశారు. వాటిపై పని పేరు, ప్రదేశం, గ్రామం, ఖర్చు అయిన నిధులు, సంవత్సరం వంటి పలు వివరాలు నమోదు చేశారు. వాటిని గ్రామాల్లోని పని ప్రదేశాలలో ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా అద్దంకిలో కార్యాల యాల వద్ద ఏళ్ల తరబడి ప డవేశారు. మరికొన్ని రాళ్లపై వివరాలు కూడా నమోదు చేయకుండా పడిఉన్నాయి. వేలకు వేలు నిధులు వెచ్చించి ఇలా నిరుపయోగంగా పడవేయడం సబబుకాదని పలువురు పేర్కొంటున్నారు.

రెండు రోజుల్లో గ్రామాలకు తరలిస్తాం

- గాయత్రి దేవి, ఏపీవో

ఉపాధి హామీ పనులకు సంబంధించి ఆడిట్‌ ఉండడం వల్ల రాళ్లను ఏర్పాటు చేయడం కొంత అలస్యమైంది. ఈ రాళన్లను పని ప్రదేశాలకు మరో రెండు రోజులలో తరలించేలా చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2023-05-02T23:10:13+05:30 IST