వైసీపీకి విద్యావంతుల చెంపపెట్టు

ABN , First Publish Date - 2023-03-18T22:38:16+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలు వైసీపీకి విద్యావంతుల చెంపపెట్టు అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు.

వైసీపీకి విద్యావంతుల చెంపపెట్టు
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

కంచర్ల గెలుపునకు కృషి చేసిన ఓటర్లకు, శ్రేణులకు కృతజ్ఞతలు

కనిగిరి, మార్చి 18 : ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలు వైసీపీకి విద్యావంతుల చెంపపెట్టు అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. అమరావతి గ్రౌండ్స్‌లో శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంపై మీ డియా సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా టీడీపీ శ్రేణులు, నాయకులు, కార్య కర్తలతో విజయోత్సవ ఆనందాన్ని ఆయన పం చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ గడచిన నాలుగేళ్లుగా అన్ని రంగాల వారినీ జగన్‌రెడ్డి నానా ఇబ్బందులకు గురి చేస్తూ రాక్షసానందం పొందారన్నారు. సమ యం వచ్చినప్పుడు చెప్తామని సిద్ధంగా ఉన్న విజ్ఞతగల ఓటర్లు ఎమ్మెల్సీ ఓటుతో గుణపాఠం చెప్పారన్నారు. రెండు నెలలుగా కనిగిరిలోని ప్రతి టీడీపీ కార్యకర్త, నాయకులు టీడీపీ ఎ మ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ విజయానికి ఎంతో శ్రమించారన్నారు. సమూహంగా ఏర్పడి చేస్తే అపజయమే ఉండదనే విషయాన్ని శ్రీ కాంత్‌ గెలుపు రుజువు చేసిందన్నారు. ఇదే స్ఫూర్తి మున్ముందు కొనసాగిస్తే 2024 ఎన్నిక ల్లో టీడీపీ అఖండ విజయం సాధిస్తుందని ఉగ్ర అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు ఎంతో నమ్మకంతో విద్యావంతులను ఎ మ్మెల్సీ బరిలో దింపగా విద్యావంతులు ఆ న మ్మకాన్ని వమ్ము చేయకుండా ఓట్లు వేశారని కృతజ్ఞతలు తెలిపారు. డబ్బుల పంపిణీ, ప్ర లోభాలకు ఎవరూ తలవంచలేదన్నారు. ఇది ప్రజా విజయమని, మార్పు మొదలైందని అ న్నారు. సమావేశంలో ఆరు మండలాల టీడీపీ అధ్యక్షులు, నియోజకవర్గ పరిశీలకులు దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నంబుల వెంకటేశ్వర్లు యాదవ్‌, ముత్తిరెడ్డి వెం కటరెడ్డి, తిరుపతిరెడ్డి, పట్టణాధ్యక్షుడు తమ్మి నేని శ్రీనివాసులరెడ్డి, నాయకులు తమ్మినేని వెంకటరెడ్డి, ముచ్చుమూరి చెంచిరెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి రోషన్‌సంధాని, రాష్ట్ర ఐటీ డీపీ నాయకులు జంషీర్‌ అహ్మద్‌, మైనార్టీ నా యకులు షరీఫ్‌, బీసీసెల్‌ నాయకులు తిరు పాలు, అడుసుమల్లి ప్రభాకర్‌, సిద్ధాంతి బారార ుుమాం, ఎల్‌వీఆర్‌, రమేష్‌, నాయకులు, కార్య కర్తలు, శ్రేణులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T22:38:16+05:30 IST