బీసీ హాస్టల్‌లో తాగునీటి సమస్య

ABN , First Publish Date - 2023-10-06T00:49:12+05:30 IST

మండలంలోని అనుమలవీడు బీసీ హాస్టల్‌లో నీటిసమస్య ఉంది. హాస్టల్‌లో దాదాపు 50 మంది విద్యార్థులు ఉంటున్నారు.

బీసీ హాస్టల్‌లో తాగునీటి సమస్య

రాచర్ల, అక్టోబరు 5 : మండలంలోని అనుమలవీడు బీసీ హాస్టల్‌లో నీటిసమస్య ఉంది. హాస్టల్‌లో దాదాపు 50 మంది విద్యార్థులు ఉంటున్నారు. బీసీ హాస్టల్‌ ఆవరణలో మిని ట్యాంక్‌ ఉన్నప్పటికీ సక్రమంగా నీరు సరఫరా లేకపోవడంతో అరకొర నీటితోనే విద్యార్థులు నెట్టుకొస్తున్నారు. ప్రతిరోజు స్నానం చేయాలన్న, బట్టలు శుభ్రం చేసుకోవాలని, టాయిలెట్లకు వెళ్ళాలన్నా పూర్తిస్థాయిలో నీరు లేకపోవడంతో విద్యార్థుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. గ్రామంలోని బీసీ కాలనీ సమీపంలోని బోరు ద్వారా నీరు సప్లై హాస్టల్‌కు వస్తున్నది. అయితే విద్యుత్‌ సమస్య వలన నీరు రావడం లేదని హాస్టల్‌ వార్డెన్‌ చెబుతున్నప్పటికీ అక్కడి సిబ్బంది ప్రతి రోజు దీనిపై దృష్టి పెట్టకపోవడంతో ఈ సమస్య నెలకొన్నది. గురువారం అనేక మంది విద్యార్థులకు పూర్తిస్థాయిలో నీరు లేకపోవడంతో అరకొర నీటితోనే స్నానం చేసే పరిస్థితి నెలకొంది.

Updated Date - 2023-10-06T00:49:12+05:30 IST