ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవా..?

ABN , First Publish Date - 2023-05-26T00:36:05+05:30 IST

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వానికి పట్టావా..? అని గిద్దలూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ ముత్తముల అశోక్‌రెడ్డి ధ్వజమెత్తారు.

ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవా..?

కంభం, మే 25: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వానికి పట్టావా..? అని గిద్దలూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ ముత్తముల అశోక్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం అర్ధవీడు మండలంలోని మాగుటూరు బీసీ కాలనీలో ఆయన పర్యటించారు. ఆ కాలనీ ప్రజలు కాలనీలోని సమస్యల గురించి వివరించారు. ఏళ్ల తరబడి సమస్యలు తీరడంలేదని వాపోయారు. గతం లో టీడీపీ ప్రభుత్వంలో మంజూరైన గృహాలకు రెండు విడతల బిల్లులు చెల్లించారన్నారు. ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో మిగిలిన బిల్లులు నిలిపివేసిందన్నారు. కాలనీలో తాగునీటి సమ స్య తీవ్రంగా ఉందన్నారు. ట్యాంకర్ల ద్వారానే నీటి సరఫరా చేస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో గ్రామల్లో మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించారని రోడ్లు, తాగునీటికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మౌలిక వసతుల గురించి పట్టించుకోవడం లేదన్నారు.

మహానాడును విజయవంతం చేయాలి

గిద్దలూరు : రాజమహేంద్రవరంలో ఈ నెల 27, 28 తేదీలలో జరగనున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ముత్తుముల అశోక్‌రెడ్డి పార్టీ శ్రేణులను కోరారు. మహానాడు పోస్టర్లను ఆయన ఆవి ష్కరించారు. ఎన్‌టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా మహానాడు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న దృష్ట్యా టీడీపీ శ్రేణులందరూ హాజరై విజయవంతం చేయాలన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు షాన్షావలి, మున్సిపల్‌ కౌన్సిలర్‌ చంద్రశేఖర్‌యాదవ్‌, టీడీపీ నాయకులు బిల్లా రమేష్‌, పెద్దభాషా, షేక్‌ మస్తాన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T00:36:05+05:30 IST