అస్తవ్యస్తంగా డ్రైనేజీ

ABN , First Publish Date - 2023-03-19T22:55:52+05:30 IST

దర్శి నగర పంచాయతీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కాల్వల్లోని ము రుగునీరు ముందుకు కదలడం లేదు. అనేకచోట్ల ము రుగునీరు నిల్వ చేరి కుంటలను తలపిస్తోంది.

అస్తవ్యస్తంగా డ్రైనేజీ

దర్శి-కురిచేడు రోడ్డులో బీసీ కాలనీలో

నివాసాల మధ్య కుంటలా మురుగు నీరు

తీవ్రమైన దోమల బెడద

అకాల వానలతో అల్లాడుతున్న ప్రజలు

దర్శి, మార్చి 19 : దర్శి నగర పంచాయతీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కాల్వల్లోని ము రుగునీరు ముందుకు కదలడం లేదు. అనేకచోట్ల ము రుగునీరు నిల్వ చేరి కుంటలను తలపిస్తోంది. అ లా ఏర్పడిన కుంటలు దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మా రాయి. కాల్వల నిర్మాణ సమయంలో అధికారులు ని బంధనలు పాటించలేదు. నేల ఎత్తుపల్లాలను సరి గా అంచనా వేయకుండా అడ్డగోలుగా నిర్మించటం వ లన మురుగునీరు ఎక్కడికక్కడే నిల్వ ఉంటోంది. దీనికితోడు షాపుల యజమానులు మురుగు కాల్వలపై శ్లాబులు వేసి ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్నా రు. కొన్నిచోట్ల కాల్వల నిర్మాణమే లేదు. బీసీ, ఎస్సీ కా లనీలు, శివారు ప్రాంతాల్లో కాల్వలు నిర్మించకపోవటంతో మురుగునీరు అనేకచోట్ల కుంటల్లా నిల్వ ఉం టుంది. దర్శి-కురిచేడు, దర్శి-అద్దంకి రోడ్లలో జోన్‌కాలువలో మురుగునీరు ఎల్లప్పుడు నిల్వ ఉంటోంది. బ స్టాండ్‌ సెంటర్‌లో మురుగునీరు ముందుకు కదలకపోవడంతో దోమలు వృద్ధి చెంది నిత్యం ప్రజలను పీ క్కుతింటున్నాయి. రెండ్రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు డ్రైనేజీల్లోకి నీరు చేరి మరింత దారుణంగా మారింది. మురుగు నీరు పొంగిపొర్లుతుండడంతో రాకపోకలకు సైతం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు డ్రైనేజీ వ్యవస్థను క్రమబద్ధీకరించేందుకు నిధులు లేవని చేతులెత్తేశారు. కనీ సం ఫాగింగ్‌ కూ డా చేయకపోవడంతో దోమల బెడద తీవ్రమైంది.

రోగాలబారిన ప్రజలు

దర్శి నగర పంచాయతీలో అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థ వల్ల దోమలు తీవ్రం కా వడంతో ప్రజలు రోగాల బారినపడుతున్నారు. దోమలు కుట్టిన అనేకమందికి టై ఫాయిడ్‌, మలేరియా జ్వరాలు సోకుతున్నా యి. కొద్ది రోజుల క్రితం ప్రైవేట్‌ పాఠశాల ల్లో చదువుతున్న విద్యార్థులకు జ్వరాలు సో కాయి. రోజులు గడుస్తున్నప్పటికీ జ్వరాలు త గ్గకపోవటంతో పరీక్షలు చేయగా కొందరికి టైఫాయిడ్‌, కొందరికి మలేరి యా జ్వరాలు అ ని తేలింది.

అధికారులు డ్రైనేజీ వ్యవస్థను క్రమబద్ధీకరించి దోమల బెడదను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

కంపు కంపు

కానరానిపారిశుధ్య పనులు

పీసీపల్లి, మార్చి 19 : మండల కేంద్రమైన పీసీపల్లిలో పారిశుధ్య ప నులు కానరావడం లేదు. కొద్దినెలలుగా కాలు వల్లో పేరుకుపోయి పూడిక తీయించకపో వడంతో కంపు కొడుతున్నాయి. కాలువలో ము రుగు నీరు నిల్వ ఉండిపోయింది. దీంతో దోమలు, కీటకాలు ఎక్కువ య్యాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నార. కంపును భరించ లేకపోతున్నామని చెప్తున్నారు. దోమల దాడితో ఇబ్బందులు పడుతు న్నామని అంటున్నారు. ప్రధానంగా ఎన్టీఆర్‌ విగ్రహం కూడలిలో ఉన్న కాలువలు చెత్తాచెదారంతో నిండిపో యాయి. మురుగు ముందుకు పోక ఎక్కడికక్కడే నిలిచి పోవ డంతో దోమలకు ఆవాస కేంద్రంగా మారాయి. పంచాయతీ అధికారులు స్పందించి కాలువల్లో పేరుకున్న పూడికను తీ యించి మురుగును వెళ్లబెట్టాలని గ్రామ స్థులు కోరుతున్నారు.

Updated Date - 2023-03-19T22:55:52+05:30 IST