శిథిలావస్థలో వంతెనలు
ABN , First Publish Date - 2023-11-23T22:04:41+05:30 IST
అద్దంకి ప్రాంతంలో పలు రోడ్లలో వంతెనలు శిథిలావస్థకు చేరాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. జగన న్నా బ్రిడ్జిలకు మరమ్మతులు ఎప్పుడు చేస్తారంటూ వాహనచోదకులు వ్యాఖ్యా నిస్తున్నారు. అద్దంకి నియోజకవర్గంలో పలు ప్రధాన రోడ్లలో ఉన్న బ్రిడ్జి లు పూర్తిగా శిథిలావస్థకు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారాయి. ప్రధా నంగా అద్దంకి-బల్లికురవ-సంతమాగులూరు రోడ్డులో వల్లాపల్లి సమీపం లో అద్దంకి బ్రాంచి కెనాల్(ఏబీసీ)పై ఆరు దశాబ్దాల క్రితం నిర్మించిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. అద్దంకి-దర్శి రోడ్డులో అద్దంకి పట్టణానికి సమీ పంలో గుండ్లకమ్మ నదిపై ఉన్న బ్రిడ్జి పూర్తిగా దెబ్బతింది. దీనిపై గోతులు పడ్డాయి. పలుచోట్ల సువ్వలు కూడా బయటపడ్డాయి.
పొంచిఉన్న ప్రమాదాలు
ఆందోళన చెందుతున్న వాహనచోదకులు
అద్దంకి, నవంబరు 23: అద్దంకి ప్రాంతంలో పలు రోడ్లలో వంతెనలు శిథిలావస్థకు చేరాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. జగన న్నా బ్రిడ్జిలకు మరమ్మతులు ఎప్పుడు చేస్తారంటూ వాహనచోదకులు వ్యాఖ్యా నిస్తున్నారు. అద్దంకి నియోజకవర్గంలో పలు ప్రధాన రోడ్లలో ఉన్న బ్రిడ్జి లు పూర్తిగా శిథిలావస్థకు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారాయి. ప్రధా నంగా అద్దంకి-బల్లికురవ-సంతమాగులూరు రోడ్డులో వల్లాపల్లి సమీపం లో అద్దంకి బ్రాంచి కెనాల్(ఏబీసీ)పై ఆరు దశాబ్దాల క్రితం నిర్మించిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. అద్దంకి-దర్శి రోడ్డులో అద్దంకి పట్టణానికి సమీ పంలో గుండ్లకమ్మ నదిపై ఉన్న బ్రిడ్జి పూర్తిగా దెబ్బతింది. దీనిపై గోతులు పడ్డాయి. పలుచోట్ల సువ్వలు కూడా బయటపడ్డాయి. దశాబ్దన్నర క్రితం బ్రిడ్జిలో రెండు కానాలు కుంగటంతో కొంతకాలం పాటు పూర్తిగా నిలిపి వేసి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. తిమ్మాయపాలెం- ఇలపావులూ రు రోడ్డులో పేరాయపాలెం వద్ద దోర్నపు వాగుపై ఉన్న వంతెన పూర్తిగా దెబ్బతింది. దీంతో ద్విచ్రకవాహనాల రాకపోపక లకు మాత్రమే పరిమిత మయ్యాయి. భారీ వాహనాలతో ఇసుక తరలించే క్రమంలో ఈఏడాది ఆగ స్టు నెల చివరలో మరింత దెబ్బతింది. అద్దంకి-రేణింగవరం రోడ్డులో నల్ల వాగుపై ఉన్న బ్రిడ్జి పూర్తిగా దెబ్బతింది. భ వనాసి వాగు, అద్దంకి బ్రాంచ్ కెనాల్ పైన పలుచోట్ల ఉన్న బ్రిడ్జిలు దెబ్బతిని కూలేందుకు సిద్ధంగా ఉన్నా యి. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే కొత్త బ్రిడ్జిలు నిర్మాణం చేపట్టాలని వాహనచోదకులు కోరుతున్నారు. గుండ్లకమ్మ బ్రిడ్జిపై ఏర్పడ్డ గోతులకు కనీసం తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని వాహనచోదకులు కోరుతున్నారు.