ధృతరాష్ట్రుని పాలన త్వరలోనే అంతం
ABN , First Publish Date - 2023-10-03T03:29:38+05:30 IST
రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని దృతరాష్ట్రుని పాలన త్వరలోనే అంతమవుతుందని, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు.
మార్కాపురం, అక్టోబరు 2: రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని దృతరాష్ట్రుని పాలన త్వరలోనే అంతమవుతుందని, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టుకు నిరసనగా స్థానిక తర్లుపాడు రోడ్డులో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో సోమవారం టీడీపీ పట్టణ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్‌శాస్త్రిల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం జగన్ రాష్ట్రంలో చేస్తున్న చెడును చూడరాదు, వినరాదు, మాట్లాడరాదంటూ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కళ్లు, చెవులు, నోటికి గుడ్డలు కట్టుకొని కొద్దిసేపు నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తున్నారన్నారు. ప్రతి పక్షాల నోరు నొక్కేసి తన ఇష్టానుసారం చేసుకొవచ్చన్న దురు ద్ధేశంతో సీఎం జగన్ ఉన్నాడన్నారు. రాష్ట్రానికి చంద్రబాబునాయుడి ఆవశ్యకతను ప్రజలు గుర్తించా రన్నారు. రానున్న 2024 ఎన్నికలలో 2014 పరిస్థితి పునరావృతం కానుందన్నారు. విజ్ఞులైన ప్రజలు అహంకారంతో విర్రవీగుతున్న సీఎం జగన్‌కు బుద్ధి చెప్పేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. జనసేన, సీపీఐ, సీపీఎం, ఇతర ప్రతిపక్షాలు కలిసి పెత్తదారులకు ఎన్నికల్లో బుద్ది చెప్తారన్నారు. నారా చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టును ఖండిస్తూ టీడీపీ కార్యకర్త కిరణ్ దీక్షా శిబరంలో అరగుండు గీయించుకొని నిరసన తెలిపాడు. కార్యక్రమంలో టీడీపీ పోల్‌మేనేన్మెంట్ ఇన్‌చార్జి కందుల రామిరెడ్డి, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జున్, మున్సిపల్ మాజీచైర్మన్ వక్కలగడ్డ రాధిక, కౌన్సిలర్లు వక్కలగడ్డ రమ్య, నాలి కొండయ్య, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి వెంకట సత్యనారాయణ, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు షేక్ మౌలాలీ, కొప్పుల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
పొదిలి : టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అనైతికంగా అరెస్ట్ చేశారని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. చంద్రబాబునాయుడి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆరు రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో సోమవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ‘సత్యమేవ జయతే’ నిరాహారదీక్ష చేస్తున్న చంద్రబాబునాయుడికి మద్దతుగా దీక్ష శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికైనా పాలనను ప్రజాస్వామ్యహితంగా నిర్వర్త్తించాలని ఆయన కోరారు. వైసీపీ అవినీతిని ఎండగడుతున్నందునే ప్రతిపక్షంపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పొదిలి, కొనకనమిట్ల మండల అధ్యక్షులు మీగడ ఓబులరెడ్డి, మోరబోయిన బాబురావు, పట్టణ అధ్యక్షులు ముల్లా ఖుద్దూస్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర నాయకులు వరికుంట్ల అనీల్, ఏఎంసీ మాజీ చైర్మన్ చప్పిడి రామలింగయ్య, మాజీ సర్పంచ్ కాటూరి నబాబు, పట్టణ కార్యదర్శి కాటూరి శ్రీను, ఎస్సీసెల్ నాయకులు ఠాగూర్, వాణిజ్యవిభాగం నాయకులు దివ్వెల మురళీ, తెలుగుయువత నాయకులు పోపూరి నరేష్, టీడీపీ నాయకులు తాతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మస్తాన్‌వలి, బుచ్చిబాబు, ఈగలపాడు సర్పంచ్, తదితర టీడీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదు
గిద్దలూరు : వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని, మహిళలే జగన్ సర్కార్‌ను భూస్థాపితం చేయనున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టుకు నిరసనగా 20వ రోజు తెలుగు మహిళలు దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరంలోనే గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రోజుకొక హత్య, పూటకొక హత్యయత్నం మహిళలపై జరుగుతుండగా ఆడంబరంగా ప్రవేశపెట్టిన దిశ చట్టం ఊసే లేదన్నారు. మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని జగన్‌రెడ్డి నెరవేర్చలేదని ఆరోపించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు ‘మేమున్నాం’ అంటూ తెలుగు మహిళలు పోస్టుకార్డులు రాసి తపాలా పెట్టెలో వేశారు. ఆయా కార్యక్రమాలలో తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు తోట మహాలక్ష్మి, ఉపాధ్యక్షురాలు దప్పిలి విజయభారతి, వాల్మీకి సాధికారక సమితి కన్వీనర్ నల్లబోతుల రమాదేవి, తెలుగు మహిళలు బొంత లక్ష్మీదేవి, సయ్యద్ రహమత్‌భీ, లలిత, ఫాతిమా, మున్సిపల్ కౌన్సిలర్ బిల్లా జయలక్ష్మి, జడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్‌రావు, సయ్యద్ షాన్షావలి, పాల్గొన్నారు.
పెద్ద దోర్నాల : టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టుకు నిరసనగా ఓ వీరాభిమాని వృద్ధుడు తన వయస్సును కూడ లెక్క చేయకుండా సంఘీభావం తెలియజేస్తూ కాలినడకన రాజమండ్రికి పాదయాత్ర చేపట్టాడు. నంద్యాల జిల్లా చిన్నదేవులాపురం గ్రామానికి చెందిన చింతల నారాయణ 70 ఏళ్ల వయస్సులో సత్యమేవ జయతే ‘బాబుతో నేను’ అంటూ బ్యానరు పట్టి సోమవారం దోర్నాల చేరుకున్నాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులు దేసు నాగేంద్రబాబు, బట్టు సుధాకర్ రెడ్డి, రావిక్రింది సుబ్బరత్నం, షేక్ రఫీ, సీమరెడ్డి, గురవారెడ్డి తదితరులు కలిసి ఆయనకు సాదర స్వాగతం పలికారు. చంద్రబాబుకు నారాయణ తెలిపిన మద్దతును అభినందించారు. ఈ క్రమంలో మార్కాపురంలో నివాసముంటున్న చింతల నారాయణ కుమార్తె, అల్లుడు కూడా కలిసి అభినందించారు.