నీటి వనరులతోనే అభివృద్ది

ABN , First Publish Date - 2023-08-22T21:53:52+05:30 IST

నీటి వనరులతోనే అభివృద్ధి సాధ్యమని శాసన మండలి సభ్యుడు కేఎస్‌ లక్ష్మణరావు అన్నారు. గుంటూరు చానల్‌ను పర్చూరు వరకు పొడిగింపునకు సంబంధించి పర్చూరులోని కొల్లావారి కల్యాణ మండపంలో మంగళవారం అభిలపక్ష సదస్సు నిర్వహించారు.

నీటి వనరులతోనే అభివృద్ది
పర్చూరులో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు

ఎమ్మెల్సీ లక్ష్మణరావు

పర్చూరు, అగస్టు 22: నీటి వనరులతోనే అభివృద్ధి సాధ్యమని శాసన మండలి సభ్యుడు కేఎస్‌ లక్ష్మణరావు అన్నారు. గుంటూరు చానల్‌ను పర్చూరు వరకు పొడిగింపునకు సంబంధించి పర్చూరులోని కొల్లావారి కల్యాణ మండపంలో మంగళవారం అభిలపక్ష సదస్సు నిర్వహించారు. నరిశెట్టి అచార్యులు అధ్యక్షతన జరిగిన సదస్సులో లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే గుంటూరు చానల్‌ పొడిగింపులో జాప్యం ఏర్పడిందన్నారు. తాగు, సాగునీటి కోసం ఎనిమిది దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వాలు స్పందించకపోవటం దారుణమన్నారు. కొల్లా వెంకన్న లాంటి గొప్పవ్యక్తులు సైతం గుంటూరు చానల్‌ను పర్చూరు వరకు పొడిగించాలని పోరాటం చేసినా నేటికీ కార్యరూపం దాల్చకపోవటం బాధాకరమన్నారు. రైతులు కలసి కట్టుగా పెద్దఎత్తున ఉద్యమం చేస్తే తప్ప చానల్‌ పొడిగింపు సాధ్యం కాదన్నారు. ప్రజలు, రైతులు నీటికోసం పడుతున్న అవస్థలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే గుంటూరు చానల్‌ పొడిగింపునకు నిధులు విఽడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కుర్రా హరిబాబు, బండి శంకరయ్య, తోటా శివనాగేశ్వరరావు, తోకల కృష్ణమోహన్‌, గడ్డిపాటి శ్రీనివాసరావు, కారుమంచి పాపారావు, అడ్డగడ్డ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T21:53:52+05:30 IST