టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం
ABN , First Publish Date - 2023-12-11T01:52:02+05:30 IST
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయ ణరెడ్డి అన్నారు.
పొదిలి, డిసెంబరు 10 : రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయ ణరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 7వ వార్డులో ‘బాబుష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తోంద న్నారు. రాష్ట్రభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు టీడీపీ విజయానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మీగడ ఓబులరెడ్డి, పట్టణాఽ ద్యక్షులు ముల్లా ఖుద్దూస్, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి గునుపూడి భాస్కర్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కాటూరి నారాయణబాబు, మాజీ సర్పంచ్ స్వర్ణగీత, టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి ఎస్‌ఎం.భాషా, జడ్పీటీసీ మజీ సభ్యు డు కాటూరి నారాయణబాబు, జిల్లా కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ముస్లీం మైనారిటీ జిల్లా అధ్యక్షులు రసూల్, మాజీ సర్పంచ్ డాక్టర్ స్వర్ణగీత, ఎంపీటీసీ మాజీ సభ్యులు ఇమాంమ్‌సా, నాయకులు ఆవులూరి యలమంద, గౌస్, జ్యోతిమల్లిఖార్జున్, షబ్బీర్, యాసిన్, మామిళ్ళపల్లి వెంకటేశ్వర్లు, మహమ్మద్‌ఆలి, బుచ్చిబాబు, మస్తాన్‌వలి బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మార్కాపురం రూరల్ : మార్కాపురంలో వైసీపీ అరాచకాలు ఆగాలంటే రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. పట్టణంలోని 21వ వార్డులో ఆది వారం ‘బాబుష్యూరిటీ- భవిష్య త్తుకు గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా నారా యణరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు మీద ఈ వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా 52 రోజుల పాటు జైల్లో నిర్బంధించిందన్నారు. మార్కా పురంలో ఆక్రమణలకు, అరచాకాలకు అంతే లేదన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, వైసీపీ ఓడిపోతుందన్నారు. ప్రజలు టీడీపీకి పట్టంగట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో పట్టణ క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు వక్కలగడ్డ మల్లికార్జున, కొప్పుల శ్రీనివాసులు, 21వ వార్డు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మార్కాపురం రూరల్ : పట్టణంలోని కంభం బస్టాండ్ కూడలిలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సమక్షంలో పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ బషీరున్నీసా బేగం తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా బషీరున్నీసా బేగం మాట్లాడుతూ.. మార్కాపురం అభివృద్ధి కందుల నారాయణరెడ్డితోనే సాధ్యమన్నారు. అందుకే టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు. అనంతరం మార్కాపురం పట్టణ తెలుగు మహిళా కమిటీని కందుల సమక్షంలో సభ్యులు ఎన్నుకున్నారు. మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మర్రి ఝాన్సీరాణిని మార్కాపురం పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలిగా, పట్టణ ప్రధాన కార్యదర్శిగా అలియా బాను, పట్టణ ఉపాధ్యక్షురాలిగా సయ్యద్ ఆశ్రవున్నిసా, పట్టణ ఉపాధ్యాక్షురాలిగా, పూసల లక్ష్మీదేవి, కార్యనిర్వహాక కార్యదర్శిగా పారు మంచాల సునీత, సంయుక్త కార్యదర్శులుగా పుట్టా లక్ష్మీదేవి, ఆదిమూలపు సుశీలమ్మ, కోశాధికారి గా గాబోలు కోటేశ్వరి, కార్యనిర్వాహక సభ్యులు కోలా భవానీ నాగలక్ష్మీ, అనురాధ, జ్యోతి, రమణ, రషిదా, మున్ని, మల్లమ్మ, మౌలాబీ, సుబ్బలక్ష్మీ, సుజాత, లక్ష్మీదేవి, లక్ష్మీ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్లు కాకర్ల శ్రీనివాసులు, పార్టీ పట్టణ కన్వీనర్ మౌలాలి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొనకనమిట్ల : వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, రానున్న ఎన్నికలలో ప్రజలు టీడీపీకి అధికారం కట్టబెట్టడం ఖాయమని మార్కాపురం టీడీపీ ఇన్‌చార్జ్ కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని కాట్రగుంట గ్రామంలో ఆదివారం టీడీపీ పార్టీ బూత్‌కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వైసీపీ చేసిన అప్పులతో రాష్ట్రం కోలుకోలేని స్థితిలో ఉందన్నారు. అయితే వైసీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు వైసీపీని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. టీడీపీ గెలుపు ఎంతోదూరంలో లేదన్నారు. రానున్న ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమాలలో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆయా గ్రామాల బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.