Share News

సైబర్‌ చీటింగ్‌

ABN , Publish Date - Dec 17 , 2023 | 10:59 PM

సైబర్‌ మాయగాళ్ల వలలో చిక్కి ఓ బాధితుడు రూ.6.90లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఉదంతం దోర్నాలలో ఆలస్యంగావెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఐనముక్కుల గ్రామానికి చెందిన చిట్యాల రామాంజనేయరెడ్డికి మొదట అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. ప్రభుత్వం నుంచి మీకు నగదు మంజూరైందని, తాను చెప్పినట్లు చేస్తే అకౌంటులో డబ్బులు పడతాయని అవతలి వ్యక్తి నమ్మబలికాడు.

సైబర్‌ చీటింగ్‌

ప్రభుత్వం నుంచి నగదు వచ్చిందని బురిడీ

రూ.6.11 లక్షలు నగదు మాయం

పోలీసుకు బాధితుడి ఫిర్యాదు

కేసు నమోదు చేసి దర్యాప్తు

పెద్దదోర్నాల, డిసెంబరు 17 : సైబర్‌ మాయగాళ్ల వలలో చిక్కి ఓ బాధితుడు రూ.6.90లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఉదంతం దోర్నాలలో ఆలస్యంగావెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఐనముక్కుల గ్రామానికి చెందిన చిట్యాల రామాంజనేయరెడ్డికి మొదట అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. ప్రభుత్వం నుంచి మీకు నగదు మంజూరైందని, తాను చెప్పినట్లు చేస్తే అకౌంటులో డబ్బులు పడతాయని అవతలి వ్యక్తి నమ్మబలికాడు. ఆంజనేయరెడ్డి తనది చిన్న సెల్‌ అని చెప్పగా అపరిచిత వ్యక్తి ఆండ్రాయిడ్‌ సెల్‌ కావాలన్నాడు. సరే మా స్నేహితుడు నెంబరు కాన్ఫరెన్స్‌లో పెడతానని లింగాల శ్రీనుకు కలిపాడు. ఆయన తనది ఆండ్రాయిడ్‌ సెల్‌ఫోన్‌ అయినప్పటికీ బ్యాంకు అకౌంటులో డబ్బులు లేవని చెప్పాడు. దీంతో అపరిచత వ్యక్తి అలా కుదరదని, కొంతైనా అమౌంటు ఉంటేనే ముందు నగదు కట్‌ అయి తిరిగి ప్రభుత్వం ఇచ్చే సొమ్ముతో కలిసి పడుతుందని నమ్మబలికాడు. దీంతో లింగాల శ్రీను తన తమ్ముడు లింగాల రమేష్‌ ఫోన్‌నెంబరును కాన్ఫరెన్స్‌లో పెట్టాడు. రమేష్‌ అపరిచిత వ్యక్తి చెప్పిన ప్రతి లింకును కలుపుకొని వారు అడిగిన ఓటీపీ నెంబరును చెప్పేశాడు. దీంతో రమేష్‌ అకౌంటులోని మొత్తం 6.90వేలు మాయమయ్యాయి. చివర్లో రూ.79వేలు మాత్రం తిరిగి రమేష్‌ అకౌంటులో జమయ్యాయి. ఈ సంఘటన ఈనెల 14వతేదీన చోటుచేసుకుంది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించాడు. ఎస్సై సైబర్‌ నేరంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Dec 17 , 2023 | 10:59 PM