Share News

కరోనా కలకలం

ABN , Publish Date - Dec 28 , 2023 | 01:32 AM

ఉమ్మడి జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసు వెలుగుచూసింది. చినగంజాం మండలం గొనసపూడికి చెందిన ఓ గర్భిణికి వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.

కరోనా కలకలం

ఉమ్మడి జిల్లాలో ఒక కేసు నమోదు

హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి వచ్చినట్లు గుర్తించిన వైద్యాధికారులు

గర్భిణీ కావడంతో ప్రత్యేక పరిశీలనలో ఉంచి చికిత్స

ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 27 : ఉమ్మడి జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసు వెలుగుచూసింది. చినగంజాం మండలం గొనసపూడికి చెందిన ఓ గర్భిణికి వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఆమె తెలంగాణ రాష్ట్రం నుంచి ఇటీవల క్రిస్మస్‌ పండుగకు స్వగ్రామానికి వచ్చారు. అనారోగ్యానికి గురవడంతో ఒంగోలులోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తీసుకొచ్చారు. అక్కడ అన్ని వైద్య పరీక్షల అనంతరం కరోనా టెస్టు కూడా చేశారు. ర్యాపిడ్‌ పరీక్షలో పాజిటివ్‌ అని నిర్థారణ అయ్యింది. దీంతో వైద్యులు వెంటనే ఆమెను ఒంగోలులోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు పంపించారు. అక్కడ కరోనా బాధితుల కోసం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో ఆమె ను అబ్జర్వేషన్‌లో ఉంచారు. బుధవారం కూడా ఆమెకు పలురకాల టెస్టులు చేసినట్లు సమాచారం. వాటి ఫలితాలు రావాల్సి ఉంది. అయితే తెలంగాణ నుంచి రావడంతో ఆమె ఉన్న స్వగ్రామంపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆమె కుటుంబ సభ్యులు, ప్రాథమిక కాంటాక్టుల వివరాలు సేక రించారు. ఆమె బంధువులను కూడా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యా ధికారులు సూచించినట్లు తెలిసింది. కాగా మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చి నట్లు జిల్లావ్యాప్తంగా ప్రచారమవడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది.

Updated Date - Dec 29 , 2023 | 06:42 AM