కొనసాగిన రిలే దీక్షలు
ABN , First Publish Date - 2023-09-19T23:55:51+05:30 IST
చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టును నిరసిస్తూ, టీడీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష శిబిరాలు కొనసాగుతూనే ఉన్నాయి.

గిద్దలూరు, సెప్టెంబరు 19 : చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టును నిరసిస్తూ, టీడీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష శిబిరాలు కొనసాగుతూనే ఉన్నాయి. వినాయకచవితి పర్వదినం రోజు కూడా శిబిరం కొనసాగింది. ముస్లింలు పెద్ద ఎత్తున ఈ రిలే దీక్షల్లో పాల్గొన్నారు. మంగళవారం తెలుగు మహిళలు రిలే దీక్షలు చేపట్టగా టీడీపీ వీరాభిమాని షేక్ అహమ్మద్ భాషా దీక్ష శిబిరంలోనే అరగుండు గీయించుకుని వైసీపీ ప్రభుత్వానికి నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి చేయడం చేతకాక ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి భౌతికదాడులు చేయిస్తూ అక్రమ కేసులు పెడుతూ అరాచక పాలన చేస్తున్నాడని విమర్శించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబును రాజకీయంగా ఎదురుకునే దమ్ములేక అక్రమ కేసుల్లో రిమాండ్‌కు పంపారన్నారు. రాష్ట్రంలో అభివృద్ది తెలుగుదేశం హయాంలోనే జరిగిందన్నారు. ముస్లిం మైనారిటీల అభివృద్ధికి చంద్రబాబు కృషిని కొనియాడారు. రెండు రోజులలో జరిగిన కార్యక్రమాలలో టీడీపీ నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు షేక్ అహమ్మద్‌బాషా, పట్టణశాఖ అధ్యక్షుడు షాన్షావలి, నాయకులు షేక్ పెద్దమస్తాన్, షేక్ మహబూబ్‌బాషా, షేక్ అబ్దుల్లా, మదార్‌వలి, మాజీ సర్పంచ్ ఖాదర్‌బాషా, టీడీపీ నాయకులు బిల్లా రమేష్, గోపాల్‌రెడ్డి, గుర్రం డానియేలు పాల్గొన్నారు.. తెలుగు మహిళ అధ్యక్షురాలు తోట మహాలక్ష్మి, మున్సిపల్ కౌన్సిలర్లు పాలుగుళ్ల శ్రీదేవి, బిల్లా జయలక్ష్మి, తెలుగు మహిళ నాయకురాళ్లు లక్ష్మీదేవి, రహమత్‌భీ, లలిత, ఫాతిమా, టీఎన్‌టీయూసీ నాయకులు పాల్గొన్నారు.
బాబుతో నేను పోస్టుకార్డు ఉద్యమం
కంభం : టీడీపీ పిలుపు మేరకు బాబుతో మేము కార్యక్రమాన్ని కంభం మండల అధ్యక్షుడు తోట శ్రీనివాసరావు, నూరుల్లాఖాద్రిలు ప్రారంభించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాని ముఖ్యమంత్రి అక్రమ కేసులు, భౌతిక దాడులు చేస్తూ రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి అక్రమ కేసులతో రిమాండ్‌కు పంపించారన్నారు. చంద్రబాబుకు మద్దతుగా పోస్టుకార్డు ఉద్యమాన్ని పారంభించారు. కార్యక్రమంలో కంభం మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైసీపీ నాయకుల పైశాచిక ఆనందం
మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం : మాజీముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి అరెస్టుతో వైసీపీ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక తర్లుపాడు రోడ్డులో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో మంగళవారం ఐదవ రోజు నియోజకవర్గంలోని తెలుగు మహిళలు నిరాహార దీక్ష చేశారు.ఈ సందర్భంగా కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనాయకుడిగా అవినీతి మరక లేకుండా ప్రజలకు సేవచేశాడన్నారు. చంద్రబాబుకు మద్దతుగా ప్రజలు స్వచ్ఛందంగా సంఘీభావం తెలుపుతున్నారన్నారు. ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించే తరుణం ఆసన్న మైందన్నారు. చంద్రబాబునాయుడు ఆరోగ్యంగా, త్వరగా జైలు నుంచి బయటకు రావాలని అన్నీ మతాలవారు ప్రార్థలను చేయడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పోల్‌మెనేజ్‌మెంట్ ఇన్‌చార్జి కందుల రామిరెడ్డి, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జున్, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి వెంకట సత్యనారాయణ, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు షేక్ మౌలాలి, కొప్పుల శ్రీనివాసులు, కౌన్సిలర్ నాలి కొండయ్య, మాజీ కౌన్సిలర్ కందుల నారాయణమ్మ, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని తెలుగు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ‘సైకో పోవాలి-సైకిల్ రావాలి’ అంటూ నినాదాలు చేశారు. ముందుగా ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు.