మోటుపల్లిలో కూలిపోయిన 16వ శతాబ్ది మండపం
ABN , First Publish Date - 2023-07-05T23:50:35+05:30 IST
రెండు వేల ఏళ్ల చరిత్ర కలిగిన అంతర్జాతీయ రేవు పట్టణం, వరక్త కేంద్రమైన మోటుపల్లిలో 16వ శతాబ్ది నాటి నాలుగు స్తంభాల మండపం కూలిపోయిందని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. మండలంలోని మోటుపల్లి గ్రామ పరిధిలోని కోదండరామాలయంలో పడిపోయిన నాలుగు స్తంభాల మండప శిథిలాలను మోటుపల్లి హెరిటేజ్ సొసైటీ కార్యదర్శి రొండా దశరథరామిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు బుఽధవారం ఆయన పరిశీలించారు.
చినగంజాం, జూలై 5 : రెండు వేల ఏళ్ల చరిత్ర కలిగిన అంతర్జాతీయ రేవు పట్టణం, వరక్త కేంద్రమైన మోటుపల్లిలో 16వ శతాబ్ది నాటి నాలుగు స్తంభాల మండపం కూలిపోయిందని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. మండలంలోని మోటుపల్లి గ్రామ పరిధిలోని కోదండరామాలయంలో పడిపోయిన నాలుగు స్తంభాల మండప శిథిలాలను మోటుపల్లి హెరిటేజ్ సొసైటీ కార్యదర్శి రొండా దశరథరామిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు బుఽధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శివనాగిరెడ్డి మాట్లాడుతూ చోళుల కాలంలో నిర్మింపబడి కాకతీయుల కాలంలో పునరుద్ధరింపబడిన రామాలయం (ప్రసన్న కేశవాలయం) ముందు ఎడమవైపున క్రీ.శ.6వ శతాబ్దంలో విజయనగరం వాస్తు శైలిలో నాలుగు స్తంభాల మండపాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు విజయనగరం మండపం పునాదుల కింద ఇసుక తొలిగిపోయి నాలుగు స్తంభాలు పడిపోయినట్లు తెలిపారు. ఆ స్తంభాలపై నాగదేవతల శిల్పాలు, కప్పు రాళ్లపై పద్మాలు చెక్కి ఉన్నాయని తెలిపారు. కూలిన నాలుగు స్తంభాలు ఒక దానిపై మరొకటి కుప్పగా పడి ఉన్నాయిని అన్నారు. ఆధునిక పునాదులపై చారిత్రక ప్రాధాన్యత గల ఈ మండపాన్ని మళ్లీ నిర్మించాలని దేవదాయశాఖాధికారులు, ఆలయ కమిటీ సభ్యులను శివనాగిరెడ్డి కోరారు. భవిష్యత్ తరాలకు మోటుపల్లి చరిత్ర తెలిసేలా మండపం నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో బుద్దవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, రొండా దశరథరామిరెడ్డిలు పాల్గొన్నారు.