పొలం వివాదంలో ఇరువర్గాల ఘర్షణ

ABN , First Publish Date - 2023-03-05T01:42:45+05:30 IST

వ్యవసాయ పొలం వి వాదంలో ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడు లు చేసుకొన్నాయి. దీంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

పొలం వివాదంలో ఇరువర్గాల ఘర్షణ

కంభం, మార్చి 4 : వ్యవసాయ పొలం వి వాదంలో ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడు లు చేసుకొన్నాయి. దీంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం సాయంత్రం అర్ధవీడు మండలం పోతురాజు టూరు గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కటికెల జయప్రకాశ్‌రావు (కంభం మండలం రావిపాడు వీఆర్‌వో) పేరు మీద ఎకరం పొలం ఉంది. దీని పక్కన 36 సెంట్ల పొలం ఖాళీగా ఉంది.. అయితే ఖాళీగా ఉన్న 36 సెంట్లు తమదేనని భాగపంపకాల్లో తన తమ్ముడుకు కటికెల రాజారత్నం పేర ఆన్‌లైన్‌లో ఉందని, పాస్‌పుస్తకం ఉందని జయప్రకాశ్‌ చెబుతున్నాడు. ఇదే గ్రామానికి చెందిన మరోవర్గం రమణ, బాలయ్య, భాస్కర్‌, గుర్రప్పడు, రామలింగం తదితరులు ఆ 36 సెంట్లు తమదేనని వాదిస్తున్నారు. జయప్రకాశ్‌, రాజారత్నం, చంద్రశేఖర్‌, రవిబాబు అన్నదమ్ములు కలిసి స్పందనలో ఫిర్యాదు చేయడంతో స్పందించిన తహసీల్దార్‌ రవిబాబు, రెవెన్యూ సిబ్బంది వివాదస్పద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం రమణ, బాలయ్య, భాస్కర్‌, గుర్రప్పడు 36 సెంట్లను స్వాధీనం చేసుకుని పొలం దున్నారు. విష యం తెలిసిన కటికల వర్గం వారు అక్కడకు వెళ్లారు. మాటామాటా పెరిగి కర్రలతో కొట్టుకు న్నారు. కటికల జయ ప్రకాశ్‌రావు, రాజారత్నం, చంద్రశేఖర్ల తలలకు గాయాలయ్యాయి. కటికల రవిబాబుకు కాలు విరిగింది. మరో వర్గంలో రమణ, బాలయ్యకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమచికిత్స అనంతరం జయ ప్రకాశ్‌, రాజారత్నం, చంద్ర శేఖర్‌ల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఒంగోలుకు తరలించారు. అర్థవీడు పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-03-05T01:42:45+05:30 IST