ఆర్యవైశ్యుల మధ్య అంతర్యుద్ధం
ABN , First Publish Date - 2023-03-18T23:58:57+05:30 IST
అద్దంకి పట్టణంలో విగ్రహాల ఆవిష్కరణలలో ఆర్యవైశ్యుల మధ్య అంతర్యుద్ధం మ రోసారి బయట పడింది. పాత గాంఽధీ బొమ్మ సెంటర్‌లో నాలుగు విగ్రహాల ఆవిష్కరణ కూడా ఆర్యవైశ్యుల మధ్య విభేదాలకు మరోసారి తెరలేపింది.

విగ్రహాల ఆవిష్కరణపై అధికారులకు ఫిర్యాదులు
నేడు కార్యక్రమానికి ఒక వర్గం ప్రయత్నాలు
అడ్డుకునేందుకు మరోవర్గం యత్నాలు
అద్దంకి, మార్చి 18: అద్దంకి పట్టణంలో విగ్రహాల ఆవిష్కరణలలో ఆర్యవైశ్యుల మధ్య అంతర్యుద్ధం మ రోసారి బయట పడింది. పట్టణంలోని పాత బ స్టాండ్ సెంటర్‌లో గత ఏడాది పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహావిష్కరణ సందర్భంగా రాజకీయ రం గు పులుముకొని వివాదాలు నెలకొని అనంతరం వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆవిష్కరింప చేశారు. అప్పట్లో అత్యధిక శాతం ఆర్యవైశ్యులు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం పాత గాంఽధీ బొమ్మ సెంటర్‌లో నాలుగు విగ్రహాల ఆవిష్కరణ కూడా ఆర్యవైశ్యుల మధ్య విభేదాలకు మరోసారి తెరలేపింది.
ఆదివారం సాయంత్రం మహాత్మాగాంధీ, సుభా్‌షచంద్రబోస్, పొట్టి శ్రీరాములు, కొణిజేటి రోశయ్య విగ్రహాల ఆవిష్కరణకు ఏర్పాట్లు చేశారు. ముఖ్య అతిథులుగా మాజీ మం త్రి శిద్దా రాఘవరావు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, శాప్‌నెట్ చైర్మన్ బాచిన కృష్ణచైతన్యతో పాటు పలువురు ఆర్యవైశ్య సంఘం నాయకులను కూడా ఆహ్వానించారు. విగ్రహాలు 13 వ వార్డు పరిఽధిలో ఉన్నందున తనకు సముచిత గౌ రవం ఇచ్చే విధంగా ప్రొటోకాల్ పాటించటం లేదని, ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన కౌన్సిలర్ విజయలక్ష్మి, మాధవరావు వైసీపీ నాయకుల దృష్టికి తీసుకు పోయారు. ఈ విషయమై తీవ్రస్థాయిలో వాగ్వివాదం కూడా చోటు చేసుకున్నట్లు సమాచా రం. అదేసమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమ లులో ఉందని, విగ్రహాల ఏర్పాటుకు మున్సిపల్ అ నుమతులు తీసుకోలేదని 13వ వార్డు కౌన్సిలర్ వి జయలక్ష్మి, 12వ వార్డు వైసీపీ ఇన్‌చార్జ్ ఊడత్ సురేష్ మున్సిపల్ ఏఈ రోహిణీ, సీఐ రోశయ్య, తహసీల్దార్ సుబ్బారెడ్డిలకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరగకుండా నిలుపుదల చేయాలని అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.
అయితే, విగ్రహాల నిర్మాణ కమిటీ సభ్యులు మాత్రం ఏదోవిధంగా కార్యక్రమం నిర్వహించాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం ఆర్యవైశ్య నాయకులు మధ్య అంతర్యుద్ధానికి కారణం కావటం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.