విష జ్వరంతో చిన్నారి మృతి
ABN , First Publish Date - 2023-09-22T23:10:59+05:30 IST
మండలంలోని ఉమా మహేశ్వర అగ్రహారం గ్రామానికి చెందిన మీనగ శివ, కోమలి దంపతుల కుమార్తె యామిని(4) చిన్నారి విష జ్వరంతో శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. యామినీకి బుధవారం రాత్రి జ్వరం రావటంతో గ్రామంలో స్థానిక ఆర్‌ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు.
ముండ్లమూరు, సెప్టెంబరు 22 : మండలంలోని ఉమా మహేశ్వర అగ్రహారం గ్రామానికి చెందిన మీనగ శివ, కోమలి దంపతుల కుమార్తె యామిని(4) చిన్నారి విష జ్వరంతో శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. యామినీకి బుధవారం రాత్రి జ్వరం రావటంతో గ్రామంలో స్థానిక ఆర్‌ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆ క్రమంలో భాగంగా బాలిక యామిని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందింది. అయితే ప్రైవేట్ వైద్యులు యామినీకి ప్లేట్లు లెట్స్ తగ్గి పోయాయని, జ్వరం అదుపులోకి రాలేదని చెప్పినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. యామిని తల్లి పది రోజుల క్రితం రెండో బిడ్డకు జన్మనిచ్చింది. తన పెద్ద కుమార్తె జ్వరం బారిన పడి మృతి చెందటంతో ఆ తల్లి బిడ్డ పై పడి ఏడుస్తున్న తీరు చూపరులను సైతం కంట తడి పెట్టించింది.
విచ్చల విడిగా ఆర్‌ఎంపీల డాక్టర్ల వైద్యం
మండలంలోని ఉమా మహేశ్వర అగ్రహారంలో ఆర్‌ఎంపీ డాక్టర్లు విచ్చలవిడిగా వైద్యం చేయటం వలనే వారి ఆగడాలకు అంతు లేకుండా పోయిందని, డబ్బే ధ్యేయంగా పెట్టుకొని రోగులను పీడిచ్చుకు తింటున్నట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.