చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష సాధింపే!

ABN , First Publish Date - 2023-10-10T23:01:53+05:30 IST

ఏ తప్పు చేయని చం ద్రబాబునాయుడను అక్రమంగా అరెస్టు చేశారని టీడీ పీ నాయకులు పేర్కొన్నారు. నెల రోజులైన కుంటి సాకులు చెబుతూ జగన్‌కు వత్తాసు పలుకుతున్న అ ధికారుల ఆటలు ఆడుకుంటున్నారని, ఇవి ఎంతోకాలం సాగవన్నారు. చంద్రబాబు నిర్ధోషిగా బయటకు రావా లని మంగళవారం అద్దంకి పట్టణంలోని శ్రీమాధవ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించా రు.

చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష సాధింపే!
సంతమాగులూరు మండలం కుందుర్రులో పూజలు చేస్తున్న తెలుగు మహిళలు

అద్దంకి టౌన్‌, అక్టోబరు 10: ఏ తప్పు చేయని చం ద్రబాబునాయుడను అక్రమంగా అరెస్టు చేశారని టీడీ పీ నాయకులు పేర్కొన్నారు. నెల రోజులైన కుంటి సాకులు చెబుతూ జగన్‌కు వత్తాసు పలుకుతున్న అ ధికారుల ఆటలు ఆడుకుంటున్నారని, ఇవి ఎంతోకాలం సాగవన్నారు. చంద్రబాబు నిర్ధోషిగా బయటకు రావా లని మంగళవారం అద్దంకి పట్టణంలోని శ్రీమాధవ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించా రు. చంద్రబాబును ఇలా చేయడం రాజకీయ కక్షసా ధింపు చర్యలేనని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ ప ట్టణ అధ్యక్షుడు చిన్ని శ్రీనివాసరావు, గార్లపాటి శ్రీని వాసరావు, నాగినేని రామకృష్ణ, సందిరెడ్డి శ్రీనివాస రావు, మన్నం త్రిమూర్తులు, కాకాని ఆశోక్‌, వడ్లపల్లి పూర్ణచంద్రరావు, ధర్మవరపు నాగేశ్వరరావు, పెంట్యాల రామాంజనేయులు, కుందారపు రామారావు, చుండూ రి మురళి, ఏ.రామాంజనేయులు, బోజనపల్లి సత్యనా రాయణ, షేక్‌ మహబూబ్‌, పోట్టి శివ, అంకం నాగరా జు, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సంతమాగులూరులో... చంద్రబాబునాయుడు నిర్ధోషి గా బయటకు రావాలని, క్షేమంగా ఉండాలని కోరుతూ కుందుర్రు గ్రామంలోని రామాలయంలో తెలుగ మహి ళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మక్కెనవారి పాలెంలోని పోలేరమ్మతల్లి దేవాలయంలోనూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వ హించారు.

చీరాలలో సర్వమత ప్రార్థనలు

చీరాల, అక్టోబరు 10: చంద్రబాబు కడిగిన ము త్యంలా బయటకు రావాలని కోరుతూ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో మంగళవారం సర్వమత ప్రార్థనలు చేశారు. కొత్తపేటలోని మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చీరాల సెయింట్‌మార్క్స్‌ లూథరన్‌ చర్చిలో కొండయ్య, నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గొ ల్లపాలెంలోని గంగమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు చే శారు. ఈపురుపాలెంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. చీరాల మండలం జాండ్రపేటలో సిద్ధి బుచ్ఛే శ్వరరావు నేతృత్వంలో షిర్డీ సా యిబాబా అలయంలో నాయ కులు, కార్యకర్తలు ప్రత్యేక పూ జలు చేశారు. వేటపాలెం మం డలం అణుమల్లిపేటలో శివాల యంలో నాయకులు, కార్యకర్త లతో కలసి కొండయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ యా కార్యక్రమాల్లో నాయకు లు నాశిక వీరభద్రయ్య, గుత్తి వీరప్రసాదరావు, షేక్‌ సుభాని, ఉసురుపాటి సురేష్‌, కొమ్మనబోయిన రజిని, గుత్తి శివయ్య, బుద్ధి బసవా చారి, కూరపాటి పూర్ణ, అమర్‌, దగ్గుబాటి వెంకట్రావు, నరాల తిరుపతిరాయుడు, తేలప్రోలు నాగేశ్వరరావు, గుమ్మ వెంకటేష్‌, రోశయ్య, నజీర్‌, దుర్గామల్లేశ్వరి, విజయలక్ష్మి, శంకరరావు, లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు విడుదల కోరుతూ పూజలు

మార్టూరు, అక్టోబరు 10: చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ మంగళవారం మండలంలో మా ర్టూరు, చిమ్మిరిబండ గ్రామాలలో టీడీపీ కార్యకర్తలు, తెలుగు మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. మా ర్టూరులోని ఆంజనేయ స్వామి గుడిలో అభిమానులు హనుమాన్‌ చాలీసా చదివి, స్వామి వారికి తమల పాకులతో ఆకు పూజ చేశారు. ఈసందర్బంగా చంద్ర బాబు త్వరగా విడుదల కావాలని స్వామి వారిని వేడుకున్నారు.

కార్యక్రమంలో తాటి నాగేశ్వరరావు, కామినేని జ నార్దన్‌, తొట్టెంపూడి భుజంగరావు, కోకా శేషగిరి,కమ్మ శివనాగేశ్వరరావు, కోకా ఉమాదేవి, తగెడ్ల శేషమ్మ, ఉ ప్పుటూరి రమాదేవి, తొట్టెంపూడి రాఘవమ్మ, చల్లగ ుండ్ల రేణుక, పచ్చల పద్మ, పుట్టా సుష్మ, తదితరులు పాల్గొన్నారు. చిమ్మిరి బండలోని ఈసీఐ చర్చిలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మహిళలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యద్దనపూడి మండలం గన్నవరం గ్రామంలో పోలేరమ్మ గుడిలో మండల పార్టీ అధ్యక్షుడు నల్లపనేని రంగయ్య చౌదరి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.

బాబుకు మద్దతుగా రిలే దీక్షలు

పర్చూరు, అక్టోబరు 10: చంద్రబాబు అక్రమ అ రెస్ట్‌కు నిరసనగా స్థానిక పార్టీ కార్యాలయంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం దీక్షలో మండలపార్టీ అధ్యక్షుడు షేక్‌ షంషుద్దీన్‌, మానం హ రిబాబు, అడ్డగడ్డ సాంబయ్య, పఠాన్‌ బాజీ, కొం డ్రగంటి శివనాగేశ్వరరావు, షేక్‌ గౌస్‌, కాపు బుల్లియ్య, షేక్‌ ట్విన్స్‌ పొల్గాని చంద్రబాబుకు మద్దతుగా నిలిచా రు. ఈసందర్భంగా షంషుద్దీన్‌ మాట్టాడుతూ చంద్ర బాబు అరెస్ట్‌ అప్రజాస్వామికమన్నారు. వైసీపీ ప్రభు త్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిగన గుణపా ఠం చెప్పటం ఖాయమన్నారు.

రాజకీయంగా ఎదుర్కోలేకే చంద్రబాబు అరెస్ట్‌

మార్టూరు, అక్టోబరు 10: చంద్రబాబును రాజకీ యంగా ఎదుర్కోలేక అక్రమంగా కేసులో ఇరికించి జ గన్మోహన్‌రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని టీడీ పీ మండల అధ్యక్షుడు తాటి నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఏ ర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా చంద్ర బాబును వేధిస్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రజానీకం గమనిస్తున్నారన్నారు. ఎలాంటి ఆధారం లేకపోయినా అక్రమంగా చంద్రబాబుపై కేసులు పెట్టటాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎ న్నికలు వచ్చినా ప్రజలు జగన్‌ ప్రభుత్వానికి బుద్ధి చె బుతారన్నారు. జగన్‌ ఆటలు ముగిశాయని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సమయం ఆ సన్నమైందన్నారు. మోసపు మాటలు, అబద్దపు వాగ్ధా నాలతో ప్రజలను ఎల్లకాలం మోసగించలేరన్నారు. సమావేశంలో నాయకులు తాటి నాగేశ్వరరావు, తొం డెపు ఆదినారాయణ, కామినేని జనార్దన్‌, గొట్టిపాటి వెంకట్రావు, తొట్టెంపూడి భుజంగరావు, రామకృష్ణ, శ్రీను నాయక్‌, రావినేని శ్రీనివాసరావు, షేక్‌ రజాక్‌ తదితరులు పాల్గొన్నారు.

అక్రమ కేసులకు భయపడేదిలేదు!

ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటాం

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

పర్చూరు, అక్టోబరు 10: వైసీపీ ప్రభుత్వం అక్ర మ కేసులకు భయపడేది లేదని టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. అరాచక అక్రమ పాలనపై ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని చెప్పారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలే మని భయంతో ఆయనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక అక్రమ కే సులు బనాయించారని ఆరోపించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేసి రాక్షస ఆనందం పొందుతున్నారన్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజల మద్దతు నూటికి నూరుపాళ్ళు టీడీపికి ఉందన్నారు. ప్రజా క్షేత్రంలో జగన్‌ చేస్తున్న ఆరాచకాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఓటమి భయంతోనే సీఎం జగన్‌ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని చంద్ర బాబుపై అక్రమ కేసులతో రాజకీయ కక్ష సాధిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో రూ.6 లక్షల కోట్లు అవినీతి జరిగిందంటూ సీఎం జగన్‌తో వైసీపీ నేతలంతా నెత్తినోరు కొట్టుకున్నారని, అధికారంలోకి వచ్చి నాలుగన్నరేళ్లయినా కనీసం 60 రూపాయలు కూడా అవినీతి జరిగినట్లు నిరూపించలేక పోయారన్నారు.

టీడీపీ హయాంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ ఏర్పాటుచేసినట్టు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసి యువతకు ఉపాధిలేకుండా చేసిందన్నారు. ఎ లాంటి అవినీతి జరగక పోయినా చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. వ్యవస్థలను సైతం మేనేజ్‌ చేసి చంద్రబాబుకు బెయిలు రాకుండా అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే ఏలూరి అన్నారు.

Updated Date - 2023-10-10T23:01:53+05:30 IST