చందవరం సాగర్‌ జలాల స్టోరేజీ ఖాళీ

ABN , First Publish Date - 2023-09-25T23:05:57+05:30 IST

మండలంలోని చందవరం గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన చందవరం-1 మంచినీటి స్టోరేజీలో సాగర్‌ జలాలు అడుగంటి స్టోరేజీ ఖాళీ అయింది. దీంతో తిరిగి సాగర్‌ కెనాల్‌కు సాగర్‌ జ లాలు విడుదలయ్యేవరకు మండలంలోని 29 గ్రామాల కు చెందిన ప్రజల దాహార్తి సమస్యను ఎదుర్కొనే ప్ర మాదం నెలకొంది. గ్రామాల్లోని ప్రజల దాహార్తి నిమిత్తం ప్రభుత్వం జులై 20వ తేదీన సాగర్‌ డ్యామ్‌ నుంచి కెనాల్‌కు సాగర్‌ జలాలు విడుదల చేసి జులై 30న నిలిపివేసింది.

చందవరం సాగర్‌ జలాల స్టోరేజీ ఖాళీ
ఒట్టిపోయిన సాగర్‌ కెనాల్‌

గ్రామాలకు నిలిచిన నీటి సరఫరా

29 గ్రామాల ప్రజల దాహార్తి కేకలు

కెనాల్‌కు నీరిస్తేనే సమస్యకు పరిష్కారం

దొనకొండ, సెప్టెంబరు 25 : మండలంలోని చందవరం గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన చందవరం-1 మంచినీటి స్టోరేజీలో సాగర్‌ జలాలు అడుగంటి స్టోరేజీ ఖాళీ అయింది. దీంతో తిరిగి సాగర్‌ కెనాల్‌కు సాగర్‌ జ లాలు విడుదలయ్యేవరకు మండలంలోని 29 గ్రామాల కు చెందిన ప్రజల దాహార్తి సమస్యను ఎదుర్కొనే ప్ర మాదం నెలకొంది. గ్రామాల్లోని ప్రజల దాహార్తి నిమిత్తం ప్రభుత్వం జులై 20వ తేదీన సాగర్‌ డ్యామ్‌ నుంచి కెనాల్‌కు సాగర్‌ జలాలు విడుదల చేసి జులై 30న నిలిపివేసింది. కేవలం పది రోజులు పాటు కెనాల్‌లో సాగర్‌ జ లాలు సరఫరా కాగా అధికారులు యుద్ధప్రాతిపదిక చం దవరం-1 స్టోరేజీకి 40 శాతం సాగర్‌ నీటిని నింపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ నీటిని గ్రామాల్లోని ప్రజలకు సరఫరా చేశారు. ప్రస్తుతం స్టోరేజీలో సాగర్‌ జ లాలు అడుగంటడంతో అధికారులు గ్రామాలకు నీటి స రఫరా నిలిపివేశారు. దీంతో రానున్న రోజుల్లో తాగేందు కు మంచినీటి కోసం తాము ఎటువంటి ఇబ్బందులు ఎ దుర్కోవలసి వస్తోందని ప్రజలు ఆందోలన చెందుతున్నా రు. తాగేందుకు మినరల్‌ వాటర్‌ను కొనుగోలు చేసుకోవలసి వస్తోందని కొందరు, మినరల్‌ వాటర్‌తో ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని మరికొందరు ఆందోళన చెందుతున్నారు. చందవరం గ్రామ సమీపంలోని సాగర్‌ కెనాల్‌కు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో మండలంలోని ప్రజల దాహార్తి నిమిత్తం సాగర్‌ జలాలను అం దించేందుకు 882 మిలియన్‌ లీటర్ల సామర్థ్యంతో చందవరం-1 మంచినీటి స్టోరేజీని 1982లో నిర్మించారు. పైప్‌లైన్‌ మరమ్మతుల కారణంగా మండలంలోని వద్దిపాడు, సంగాపురం, వెంకటాపురం, ఇండ్లచెరువు, రాగమక్కపల్లి గ్రామాల ప్రజలు ఏళ్ల తరబడి సా గర్‌ నీటికి నోచుకోలేదు. మంచినీటి పథకం పురాతనమైనది కావడంతో పైప్‌లైన్‌లు మరమ్మతులకు గురవు తూ నీటి సరఫరాకు తరచూ అంతరాయం కలుగుతోంది. దొనకొండ ప్రజల దాహార్తికి సాగర్‌ జలాలు ఎంతో ప్రాముఖ్యం కావడంతో నీటి సరఫరా నిలిచిన సమయంలో ఆందోళనకు గురవుతూ సా గర్‌ జలాల సరఫరా కోసం ఎదురుచూస్తుంటారు. దశాబ్దాలు గడుస్తున్నా, గ్రామాల్లో జనాభా పెరుగుతున్నా చందవరం-1 మంచినీటి స్టోరేజీ అభివృద్ధికి నోచుకోకపోవడంతో తాగునీటి సమస్య వెంటాడుతూనే ఉంది. అధికారులు స్పందించి ప్రజల దాహార్తి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తాగేందుకు కెనాల్‌కు సాగర్‌ జలాలను త్వరగా విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామాల్లోని ప్రజలు కోరుతున్నారు.

3

Updated Date - 2023-09-25T23:05:57+05:30 IST