చలో విజయవాడకు అనుమతి లేదు !
ABN , First Publish Date - 2023-03-19T23:09:10+05:30 IST
చలో విజయవాడ కార్యక్రమానికి ప్రభుత్వ, పోలీస్ అనుమతి లేదని, ఈ కార్యక్రమంలో పాల్గొనడం చట్ట రీత్యా నేరమని హెచ్చరిస్తూ పోలీసులు తెలుగుదేశం పార్టీ, వామపక్షపార్టీల నాయకులకు ఆదివారం నోటీసులు ఇచ్చా రు.

టీడీపీ, వామపక్ష నేతలకు పోలీసుల నోటీసులు
టంగుటూరు, మార్చి 19: చలో విజయవాడ కార్యక్రమానికి ప్రభుత్వ, పోలీస్ అనుమతి లేదని, ఈ కార్యక్రమంలో పాల్గొనడం చట్ట రీత్యా నేరమని హెచ్చరిస్తూ పోలీసులు తెలుగుదేశం పార్టీ, వామపక్షపార్టీల నాయకులకు ఆదివారం నోటీసులు ఇచ్చా రు. జీవో నంబర్ 1 ని రద్దు చేయాలని, అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని, తదితర డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ టీడీపీ, వామపక్ష పార్టీలు సోమవారం చలో విజయవాడ కు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తం అ య్యారు. ఈ కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించి, టీడీపీ, వామపక్షాల వారిని ఎవరినీ అటువైపు వెళ్లకుండా చేసేందుకు ప్రభుత్వ ఆదేశానుసారం పోలీసులు చర్యలు చేపట్టారు. టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో టీడీపీ, వామపక్షాలకు చెందిన 30 మం ది నాయకులకు ఆదివారమే నోటీసులు అందజేశా రు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కామని విజయకుమార్‌ను టంగుటూరులోని పొగాకు కంపెనీలో కలిసి కానిస్టేబుల్ నోటీసు ఇచ్చి వెళ్లాడు. అలా గే సీపీఎం మండల కార్యదర్శి వి.మోజెస్ సొంత ప నిపై స్వగ్రామం పొందూరు నుంచి ఒంగోలు వెళ్లి వస్తుండగా దారి కాచి ఒంగోలు నగర శివారులో నోటీస్ ఇచ్చారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి. రాము, కేవీపీఎస్ మండల నాయకుడు కొల్లాబత్తిన శ్రీనును పోలీస్ స్టేషన్‌కు పిలిపించి స్యయంగా ఎస్సై ఖాదర్‌బాషా నోటీసులు అందజేశారు. అలాగే మర్లపాడు, కొణిజేడు, యరజర్ల గ్రామాల్లోని అంగనవాడీ సంఘాల నాయకురాళ్లకు పోలీసులు నోటీసులు అం దించారు. మొత్తంగా ముందుగా ఎంపిక చేసుకున్న వారికి నోటీసులు అందిస్తున్నారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ఆ ప్రాంతంలో 30 పోలీస్ యాక్టు అమలులో ఉందని, 144 సెక్షన్ కూడా విధించారని, ఈ పరిస్థితుల్లో చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎవరైనా కదలినట్లు తాము గుర్తించినా ఇ క్కడే నిలిపివేస్తామని, ఆదివారం సాయంత్రం నుంచే బస్టాండ్, రైల్వే స్టేషన్, జాతీయ రహదారిలోని టోల్‌ప్లాజా వద్ద పోలీస్ నిఘా ఉంటుందని హెచ్చరించారు.