Share News

ఆరోగ్యశ్రీ అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలి

ABN , Publish Date - Dec 18 , 2023 | 10:42 PM

పొదిలిలోని ఒక ప్రైవేటు హాస్పటల్‌లో ఆరోగ్యశ్రీ అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలని వైసీపీ బహిష్కృత నేత పెద్దిరెడ్డి సూర్యప్రకా్‌షరెడ్డి డిమాండ్‌ చేశారు. ఒంగోలులోని తన నివాసంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదల ఆరోగ్యం కోసం సీఎం జగన్మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని పొదిలికి చెందిన ఓ డాక్టర్‌ భ్రష్టుపట్టిస్తున్నాడని ఆరోపించారు.

ఆరోగ్యశ్రీ అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలి

వైసీసీ బహిష్కృత నేత పెద్దిరెడ్డి డిమాండ్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 18: పొదిలిలోని ఒక ప్రైవేటు హాస్పటల్‌లో ఆరోగ్యశ్రీ అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలని వైసీపీ బహిష్కృత నేత పెద్దిరెడ్డి సూర్యప్రకా్‌షరెడ్డి డిమాండ్‌ చేశారు. ఒంగోలులోని తన నివాసంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదల ఆరోగ్యం కోసం సీఎం జగన్మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని పొదిలికి చెందిన ఓ డాక్టర్‌ భ్రష్టుపట్టిస్తున్నాడని ఆరోపించారు. మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి బంధువు వైద్యశాలలో భారీ అక్రమాలు జరిగాయన్నారు. కోట్లల్లో అవినీతి చేసినట్లు ఆరోపణలున్నాయని ప్రజలు చెప్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. తాను చెప్పిందే వేదంగా ప్రభుత్వ పెద్దలు, అధికారులు నడుస్తారని చెప్పుకుంటూ అందరినీ బెదిరిస్తారని పేర్కొన్నారు. ఆ వైద్యశాల ఎంప్యానల్మెంట్‌ను ఎవరైనా రద్దుచేయాలని ప్రయత్నిస్తే వారి అంతు చూస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మంగళగిరిలోని ఆరోగ్యశ్రీ ట్రస్టులో ఉన్న పీఎంయూ, ఐటీ, అలాగే సీఎంఓ, ఇతర అధికారులంతా తాను చెప్పిందే వేదంగా ఉంటారని, తన మాటను ఎవరైనా కాదని అడుగు ముందుకు వస్తే వారిని, వారి కుటుంబ సభ్యులను భయపెడుతుండటంతో ప్రశ్నించే వారు కరువయ్యారని తెలిపారు. ఆరోగ్యశ్రీ ట్రస్టులో ఆపరేషన్‌ సీఈవోగా పనిచేస్తున్న అతని అవినీతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని కోరారు. పొదిలిలో సొంత హాస్పటల్‌లో ఆరోగ్యశ్రీ ఎంప్యానల్మెంట్‌ పెట్టుకొని నెలనెల రూ.50లక్షలకుపైగా ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న ఆ వైద్యశాల డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని పెద్దిరెడ్డి డిమాండ్‌ చేశారు.

Updated Date - Dec 18 , 2023 | 10:42 PM