ఉపాధ్యాయురాలిని వేధిస్తున్న సీఆర్పీపై కేసు

ABN , First Publish Date - 2023-08-22T23:48:22+05:30 IST

ఒంగోలులోని ఓ స్కూల్‌లో పనిచేస్తున్న ఉ పాధ్యాయురాలిపై వేధింపులకు పాల్పడుతున్న సీఆర్పీ చంద్రశేఖర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

 ఉపాధ్యాయురాలిని వేధిస్తున్న సీఆర్పీపై కేసు

ఒంగోలు(క్రైం), ఆగస్టు 22: ఒంగోలులోని ఓ స్కూల్‌లో పనిచేస్తున్న ఉ పాధ్యాయురాలిపై వేధింపులకు పాల్పడుతున్న సీఆర్పీ చంద్రశేఖర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను భయపెట్టి మోటార్‌సైకిల్‌ పై ఎక్కించుకోవడమే కాకుండా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తనతో చనువుగా ఉండకపోతే తన వద్ద ఉన్న కాల్‌ రికార్డ్సు అందరికీ వినిపిస్తానని బెదిరింపులకు గురి చేస్తు న్నాడని, తనకు న్యాయం చేయలని పోలీసులను వేడుకుంది. ఈ మేరకు వన్‌టౌ న్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-08-22T23:48:22+05:30 IST