మిస్టరీగా మారిన బాలుని హత్య

ABN , First Publish Date - 2023-09-04T22:45:55+05:30 IST

సీఎ్‌సపురం మండలంలోని చింతలపాలెం ఎస్సీ కాలనీలో గత నెల 30వ తేదీ అర్ధరాత్రి నానమ్మ పక్కన నిద్రిస్తూ అదృశ్యమై హత్యకు గురైన 16 నెలల బాలుని కేసు మిస్టరీగా మారింది.

మిస్టరీగా మారిన బాలుని హత్య

పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు

సీఎ్‌సపురం, సెప్టెంబరు 4 : మండలంలోని చింతలపాలెం ఎస్సీ కాలనీలో గత నెల 30వ తేదీ అర్ధరాత్రి నానమ్మ పక్కన నిద్రిస్తూ అదృశ్యమై హత్యకు గురైన 16 నెలల బాలుని కేసు మిస్టరీగా మారింది. మైలారి సామ్యేలు, కెజియాల కుమారుడు సాత్విక్‌ షాలోం నానమ్మ పక్కన నిద్రిస్తుండగా అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి మెలకువ వచ్చి పక్కన బిడ్డ లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో మూడు రోజుల పాటు పోలీసులు విస్తృతంగా గాలించినా బాలుని జాడ కనిపించలేదు. ఆదివారం చింతలపాలెం సమీపంలో గేదెలు కాచే వ్యక్తికి పొలాల్లో నుంచి దుర్వాసన రావడంతో దగ్గరకు వెళ్లి చూడగా బాలుని మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహం సాత్విక్‌దిగా నిర్థారించారు. ఈ హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారనే విషయం నేటికీ తేలలేదు. క్రైమ్‌ ఏఎస్సీ శ్రీధర్‌రావు, డీఎస్పీ రామరాజు ఆధ్వర్యంలో పా మూరు, పొదిలి, కనిగిరి, త్రిపురాంతకం సీఐలు, వెలిగండ్ల, పామూరు, గిద్దలూరు, సీఎ్‌సపురం ఎస్సైలు బృందాలుగా ఏర్పడి హత్య కేసు ఛేదించేందుకు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం బాలుని మృతదేహం గుర్తించిన చోట క్లూస్‌ టీం వివరాలు సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-09-04T22:45:55+05:30 IST