ఓట్ల చేర్పులు, తొలగింపుల్లో అక్రమాలకు బీఎల్వోలదే బాధ్యత
ABN , First Publish Date - 2023-06-26T23:03:14+05:30 IST
ఓటర్ల జాబితాలో ఏ చిన్న పొరపాటు జరిగినా, అక్రమాలు దొర్లాయని ఆరోపణలు వచ్చి నా బీఎల్వోలే బాధ్యత వహించాలని ఆర్డీవో అజయ్‌కుమార్ హెచ్చరించారు. బీఎల్వోలు బాధ్యతాయుతంగా పనిచేస్తే ఈ సమస్య తలెత్తదని సూచించారు.
ఆర్డీవో హెచ్చరిక
పీసీపల్లి, జూన్ 26 : ఓటర్ల జాబితాలో ఏ చిన్న పొరపాటు జరిగినా, అక్రమాలు దొర్లాయని ఆరోపణలు వచ్చి నా బీఎల్వోలే బాధ్యత వహించాలని ఆర్డీవో అజయ్‌కుమార్ హెచ్చరించారు. బీఎల్వోలు బాధ్యతాయుతంగా పనిచేస్తే ఈ సమస్య తలెత్తదని సూచించారు. స్థానిక మండల పరిషత్ సమావేశపు హాలులో సోమవారం బూత్ లెవల్ అధికారులతో ఓటర్ల జాబితాల పరిశీలనపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో ఓటుకు ఆధార్ సీడింగ్ ప్రక్రియ చాలా తక్కువగా ఎందుకు ఉందని బీఎల్వోలను ప్రశ్నించారు. మైగ్రేషన్ కారణంగానే ఆధార్‌సీడింగ్ చేయలేకపోతున్నామని పలువురు తెలిపారు. క్షేత్రస్థాయిలో గృహసందర్శన చేసి వివాహమై వెళ్లిపోయిన వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని సూచించారు. ఒకే డోర్ నెంబరుతో అత్యధికంగా ఓట్లు నమోదై ఉంటే స్థానికంగా ఒకటికి రెండుసార్లు విచారించి ఆ వివరాలను ఏఈఆర్వో, ఈఆర్వోల దృష్టికి తీసుకురావాలన్నారు. ఒక్కొక్క బీఎల్వో రోజుకు 25ఇళ్లు తిరిగి ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. సమావేశంలో ఏఈఆర్వో ప్రవీణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.