మహాశక్తితో మహిళలకు ప్రయోజనం
ABN , Publish Date - Dec 14 , 2023 | 10:38 PM
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మహాశక్తి పథకాలతో మ హిళలకు ప్రమోజనం కలుగుతుందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. మన ఊరు - మన ఉగ్ర కా ర్యక్రమంలో భాగంగా బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని ప ట్టణంలో టీ డీపీ, జనసేన శ్రేణులతో కలిసి గురువారం రో డ్‌షో కార్యక్రమం నిర్వహించారు. పువ్వాడి క ల్యాణ మండపం నుంచి పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఉగ్ర రోడ్ షో చేశారు. ఈసందర్భంగా ఆరు గ్యారెంటీ పథకాలపై ప్ర జలకు అవగాహన కల్పించారు.
కార్యకర్తల్లో జోష్ నింపిన ఉగ్ర రోడ్ షో
పామూరు, డిసెంబరు 14 : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మహాశక్తి పథకాలతో మ హిళలకు ప్రమోజనం కలుగుతుందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. మన ఊరు - మన ఉగ్ర కా ర్యక్రమంలో భాగంగా బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని ప ట్టణంలో టీ డీపీ, జనసేన శ్రేణులతో కలిసి గురువారం రో డ్‌షో కార్యక్రమం నిర్వహించారు. పువ్వాడి క ల్యాణ మండపం నుంచి పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఉగ్ర రోడ్ షో చేశారు. ఈసందర్భంగా ఆరు గ్యారెంటీ పథకాలపై ప్ర జలకు అవగాహన కల్పించారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి మహిళలను కాపాడేందుకే చంద్రబాబు పథకాలను రూపొందించారన్నారు. ఒక్క చాన్స్‌తో వచ్చిన జగన్‌రెడ్డి వ్యవస్థలను నాశనం చే శారని ధ్వజమెత్తారు. పాదయాత్రలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయారన్నారు. అభివృద్ధి లేకపోగా రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రగా మార్చారన్నారు. అన్నివర్గాలు, అన్ని సంస్థలవా రు ఆందోళనబాట పడుతున్న విషయాన్ని ఉ గ్ర గుర్తుచేశారు. బాదుడేబాదుడు అంటూ అ న్నింటిపైనా ధరలు పెంచి సామాన్యుల నడ్డివిరుస్తున్నారని ఆవేద న వవ్యక్తం చేశారు. రోడ్ షోలో తెలుగు మహిళలు నృత్యాలు చేస్తూ ఉ త్సాహంగా పాల్గొన్నారు. ఉగ్రకు స్వాగతం ప లుకుతూ స్థానికులు కరపత్రాలను అందుకున్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తల్లో ఉగ్ర షో జోష్‌ను నింపింది. కార్యక్రమంలో టీడీపీ మం డల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, అడుసుమల్లి ప్రభాకర్‌చౌదరి, మాజీ ఎంపీపీ పువ్వాడి తిరుపతమ్మ, జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు ఏ లూరి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ మాజీ సభ్యులు బొల్లా మహాలక్ష్మ మ్మ, ఎం.హుసేన్‌రావు యాదవ్, ఎంపీటీసీ సభ్యుడు నరసింహారావు, శ్రీను, ఖాజారహంతుల్లా ఫోర్‌మెన్ కమిటీ స భ్యుడు హరిబాబు, ఇర్రికోటిరెడ్డి, గౌస్‌బాషా, రమాదేవి, సుబ్బమ్మ, రమణమ్మ, జనసేన పా ర్టీ జిల్లా కార్యదర్శి రహీముల్లా పాల్గొన్నారు.
పీసీపల్లి : చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర భవిష్యత్తు గాడిలో పడుతుందని టీ డీపీ మండల అధ్యక్షుడు వేమూరి రామయ్య అన్నారు. మండలంలోని గుంటుపల్లి, తురకపల్లి గ్రామాల్లో గురువారం బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలకు కరపత్రాలు పంచి బాట్ నమోదు కార్యక్రమం చేపట్టారు. రామయ్య మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో వివిధ నిబంధనల పేరుతో కోతలు విధిస్తూ వైసీపీ పేదలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు కనిగిరి ఎమ్మెల్యేగా ఉగ్రని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కా ర్యక్రమంలో బద్దిపూడి ఎబినేజరు, రత్తయ్య యాదవ్, మండే పెద్దిరెడ్డి, కోమటిగుంట్ల వీర య్య, గోగాడ నరసింహారెడ్డి, మూలె సత్తిరెడ్డి, బ్రహ్మయ్య, మాలకొండారెడ్డి, రమణయ్య, నాగిరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ముండ్లమూరు : చంద్రబాబు హయాంలోనే బలహీన వర్గాలవారు అభివృద్ధి చెందా రని మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు అన్నారు. మండలంలోని పులిపాడు తండా పంచాయతీలో బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీ, ఎస్సీ, ఎస్టీలపై ని త్యం దాడులు చేసి అక్రమ కేసుల్లో ఇరికించి జైలుకు పంపుతున్నారన్నారు. మరో మూడు నె లల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పనున్నారన్నారు. టీడీపీని అఽధికారంలోకి తెచ్చేందుకు అ న్ని వర్గాల వారు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలన్నారు. కార్యక్రమంలో ముండ్లమూరు, దర్శి మండల పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు, చిట్టె వెంకటేశ్వర్లు, సర్పంచ్ జానావత్ చిన్నా నాయక్, మాజీ ఎంపీటీసీ తులసీ నాయక్, బాలాజీ నాయక్, శివా నాయక్, బాలు నాయక్, చౌదరి నాయక్, అంజినాయక్ తదితరులు ఉన్నారు.