స్ఫూర్తిమంతంగా మేడే
ABN , First Publish Date - 2023-05-02T00:52:23+05:30 IST
కార్మికుల హక్కుల పరిరక్షణకు సంఘటితంగా ఉద్యమించాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు అందె నాసరయ్య పేర్కొన్నారు.
మార్కాపురం, మే 1: కార్మికుల హక్కుల పరిరక్షణకు సంఘటితంగా ఉద్యమించాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు అందె నాసరయ్య పేర్కొన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వ హించారు. ఏఐటీయూసీ నాయకులు అందె నాసరయ్య, షేక్ కాశిం, సీఐటీయూ నాయకులు డి.సోమయ్య, డీకెఎం రఫీల ఆధ్వర్యంలో పూలసుబ్బయ్య కాలనీ, పాతబస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్, ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయాలు, పాత మార్కెట్ ప్రాంతాలలో కార్మిక జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా అందె నాసరయ్య మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాసే విధంగా బీజేపీ ప్రభుత్వం కుట్రపన్నుతుందన్నారు. నష్టాల బూచిని చూపి కారుచౌకగా ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందన్నారు. సీపీఐ నాయకులు చిత్తారి పెద్దన్న, ఎం.వెంకయ్య, ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వై.వెంకటరెడ్డి, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఓ.వీరారెడ్డి, పాల్గొన్నారు.
త్రిపురాంతకం : మేడే వేడుకలను పలు సంఘాల ఆద్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. సీపీఐ, ఏఐటీయూసీ, సీఐటీయూ ఆద్వర్యంలో మోటారు వర్కర్స్ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వ ర్యంలో వారి కార్యాలయం వద్ద కార్మిక జెండాలు ఎగుర వేశారు. కార్యక్రమంలో నాయకులు డి.శ్రీనివాస్, బి.రామయ్య, యూటీఎఫ్ మండల నాయకులు పాల్గొన్నారు.
గిద్దలూరు : మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల సాధన కోసం ఐక్యపోరాటాలు కొనసాగించాలని పలు కార్మిక సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ జెండాను యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి వి.రంగారెడ్డి ఆవిష్కరించారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఆవులయ్య మాట్లాడుతూ కార్మికులంతా ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలన్నారు. ఆశ, మధ్యాహ్న భోజన పథకం, మున్సిపల్, మెప్మా, స్వచ్ఛభారత్ కార్మికులకు కనీస వేతనాలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పద్మ, నరసింహులు శ్రీనివాసులు, రమేష్, తదితరులు పాల్గొన్నారు. కాగా ఎఐటియుసి జిల్లా కార్యదర్శి షేక్ మహమ్మద్ ఇబ్రహీం ఆధ్వర్యంలో ఆటోవర్కర్లు, ఇతర యూనియన్ల నాయకులు భారీ ఆటోర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆటోవర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ ప్రతినిధులు కేపీ.రావు, బెంజిమన్, రజనికుమార్, గోవింద్, తదితరులు పాల్గొన్నారు.
బేస్తవారపేట: పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ కార్మికులు మేడే సందర్భంగా జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో వ్యవసా య సంఘం కార్మికుల సంఘం నాయకులు బి.గాలెయ్య, సీఐటియూ డివిజన్ కార్యదర్శి తత్తూరి దానంలు కార్మికుల సేవలను కొని యాడారు. కార్యక్రమంలో బి.అమృతరాజు, జి.అబ్రహాం, కె.కాశయ్య. డి.దీనావళి, ఎం.రంగయ్య, సీ.హెచ్.సుబ్బరాయుడు, ఎన్.తిరుపతి, ఎస్.కె.ఫయాజ్, సీ.హెచ్.రాజు, షేక్.ఖాదర్‌వలి తదితరులు పాల్గొన్నారు.
కంభం : పట్టణంలో సోమవారం మేడే వేడుకలను పలు కార్మికుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనం గా నిర్వహించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు షేక్.మహ్మాద్ ఇబ్రహీం, ఎం.ఎస్.బేగ్‌లు మాట్లాడుతూ కార్మికులందరు లేబర్ కోడ్‌లు, రైతు చట్టాలపై రద్దుకై పోరాడాలన్నారు. కార్పొరేట్ సంస్థల ఆదాయంపై సీలింగ్ విధించాలన్నారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి, కార్మికులను పర్మెంట్ చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం చేల్లించాలన్నారు. కంభం, కందులాపురం కూడలిలో అరుణపతాకాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రంగనాయకులు, ఆటో యూనియన్ అధ్యక్షుడు, కార్యదర్శులు యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
పుల్లలచెరువు : ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలో జెండాను ఆవిష్కరించారు. ఎర్రగొండపాలెంలో సీపీఐ కార్యాలయం నుంచి పట్టణంలో ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి జీవీ గురునాథం మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేటీకరణ మోజులో పడి కార్మికులను విస్మరిస్తుందని విమర్శిం చారు. కార్మికులు ఐకమత్యంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు టీసీహెచ్ చెన్నయ్య, కేవీ.కృష్ణగౌడ్, ఏఐటీయూసీ నాయకులు రహమాన్, శ్రీనువాసచారి, కనకరత్నచారి, ఎర్రగొండపాలెం ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.