ప్రజల్లోకి బాబు ష్యూరిటీ..భవిష్యత్‌కు గ్యారెంటీ
ABN , First Publish Date - 2023-11-21T22:07:36+05:30 IST
రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాలను వేగవంతం చేయా లని టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు నా దెండ్ల బ్రహ్మంచౌదరి, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు శ్రేణులకు పిలుపునిచ్చారు. టీ డీపీ కార్యాలయంలో ముండ్లమూరు మండల టీడీపీ సమావేశం మంగళవారం జరిగిం ది.

నాదెండ్ల, నారపుశెట్టి పిలుపు
దర్శి, నవంబరు 21 : రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాలను వేగవంతం చేయా లని టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు నా దెండ్ల బ్రహ్మంచౌదరి, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు శ్రేణులకు పిలుపునిచ్చారు. టీ డీపీ కార్యాలయంలో ముండ్లమూరు మండల టీడీపీ సమావేశం మంగళవారం జరిగిం ది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వ ర్గాల ప్రజల బాగు కోసం మేనిఫెస్టోలో పొందు పరిచిన పథకాలు, వాటితో కలిగే లబ్ధిని ప్రజల కు వివరించాలన్నారు. చంద్రబాబు ముఖ్యమం త్రి అయితే రాష్ట్రంతోపాటు ప్రజలందరూ బా గుంటారని తెలియజేయాల న్నారు. అదే స మయంలో వైసీపీ పాలకుల అవినీతి, అక్రమాలు, దోపిడీలను ప్రజలకు వివరించాలన్నారు. నాలుగున్నరేళ్లలో రాష్ట్రాన్ని అన్నివిధాలా నా శనం చేసిన తీరును తెలియజేయాలని నా యకులు, కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో ముండ్లమూరు మండల టీడీపీ అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కె.నాగరాజు, వరగాని పౌలు, నాయకులు పాల్గొన్నారు.
బాబుతోనే మహిళా సంక్షేమం
పామూరు : మహిళల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని టీడీపీ పట్టణ అ ధ్యక్షుడు షేక్ ఖాజారహంతుల్లా అన్నారు. టీ డీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఉగ్ర ఆదేశాలతో పట్టణంలోని 268 బూత్ పరిధిలో బాబు ష్యూ రిటీ..భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని మం గళవారం నిర్వహించారు. మహిళల సంక్షేమం దృష్ట్యా ముందుచూపుతో చంద్రబాబు మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలను పొందుపరిచారని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగా నే ఆ పథకాల అమలుతో మహిళలు ఆర్థికం గా అభివృద్ధి చెందుతారని అన్నారు. టీడీపీని గెలిపించుకోవలిసిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. కార్యక్రమంలో బూత్ కమిటీ ఇన్‌చార్జి ఫత్తుమస్తాన్, తెలుగు రైతు అధ్యక్షుడు మన్నం రమణయ్య పాల్గొన్నారు.
పార్టీ విజయానికి కృషి చేయాలి
తాళ్లూరు : దర్శి నియోజకవర్గంలో టీడీపీ పటిష్టంగా ఉందని నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు బ్రహ్మంచౌదరి అన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ మండల అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓ బుల్‌రెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం మంగళవారం జరిగింది.ఎన్నికలను దృష్టిలో పె ట్టుకొని అభ్యర్థి గెలుపునకు టీడీపీ శ్రేణులు అ ప్రమత్తంగా కృషి చేయాలని కోరారు. ఓ టర్ల జాబితాలను క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీ, శ్రేణులు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. జాబితాలో పేర్లు లేకుంటే వెంటనే నమోదు చేయించాలన్నారు. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ అధినాయకత్వం నిర్ణయించిన అభ్యర్థి విజయానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శులు మానం రమే్‌షబాబు, శాగంకొండారెడ్డి, టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ కాలేషావలి, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, జనసేన పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు కూటాల ప్రసాద్, నియోజకవర్గ ఐటీడీపీ ఇన్‌చార్జి రామయ్య, టీడీపీ మహిళానేత మారాబత్తుల సుజాత, రామకోటిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.