కదంతొక్కిన అంగన్‌వాడీలు

ABN , First Publish Date - 2023-02-07T00:17:59+05:30 IST

అంగన్‌వాడీ కార్యకర్తలు ఒంగోలులో కదంతొక్కారు. కనీస వేతనం రూ.26వేలు చెల్లించడంతోపాటు, రాజకీయ వేధింపులను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. అర్హత ఉన్న వారికి ఉద్యోగోన్నతులు కల్పించాలని నినదించారు. ప్రభుత్వ తీరుపై పలువురు మండిపడ్డారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) పిలుపు మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్‌ ఎదుట కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించారు.

కదంతొక్కిన అంగన్‌వాడీలు
కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలో పాల్గొన్న అంగన్‌వాడీలు

కనీస వేతనాలు చెల్లించాలని,

రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్‌

జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన

వందలాది మంది కార్యకర్తలు

ఒంగోలు (కలెక్టరేట్‌), ఫిబ్రవరి 6 : అంగన్‌వాడీ కార్యకర్తలు ఒంగోలులో కదంతొక్కారు. కనీస వేతనం రూ.26వేలు చెల్లించడంతోపాటు, రాజకీయ వేధింపులను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. అర్హత ఉన్న వారికి ఉద్యోగోన్నతులు కల్పించాలని నినదించారు. ప్రభుత్వ తీరుపై పలువురు మండిపడ్డారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) పిలుపు మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్‌ ఎదుట కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించడంతోపాటు, ఫేస్‌ యాప్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పర్యవేక్షణ పేరుతో జరుగుతున్న వేధింపులను వెంటనే అరికట్టాలన్నారు. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ మోనూ చార్జీలను పెంచడంతోపాటు గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. 2017నుంచి పెండింగ్‌లో ఉన్న టీఏ బిల్లుల చెల్లింపుతోపాటు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ ఇవ్వాలని నినదించారు. ఉద్యోగోన్నతుల్లో రాజకీయ జోక్యాన్ని నివారించాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న డీఆర్వో ఓబసులేసు ధర్నా శిబిరం వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. తమ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని, మిగిలిన వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. వై.సత్యవతి అధ్యక్షతన జరిగిన ధర్నాలో యూనియన్‌ ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణ, నాయకులు కల్పన, ధనలక్ష్మి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కాలం సుబ్బారావు, రమేష్‌, శ్రీరామ శ్రీనివాసరావు, మహేష్‌, వెంకట్రావు, జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:18:02+05:30 IST