అరాచక పాలనకు చరమగీతం పాడాలి

ABN , First Publish Date - 2023-09-25T23:09:11+05:30 IST

ఓటుతోనే వైసీపీ అరాచ క పాలనకు బుద్ధిచెప్పాలని టీడీపీ బాపట్ల పార్లమెం ట్‌ అఽధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలు పునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు అరెస్ట్‌కు నిరసనగా స్థానిక తెలుగుదేశం పార్టీ కా ర్యాలయంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సోమ వారం నాగులపాలెం తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపట్టిన రిలే దీక్షలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు. అంతకుముందు పర్చూ రు నియోజకవర్గ పరిశీలకులు సింహాద్రి యాదవ్‌ పా ల్గొని దీక్షకు సంఘీభావం తెలిపారు.

అరాచక పాలనకు చరమగీతం పాడాలి
కారంచేడులో మేము సైతం బాబుతో అంటూ నిరసన తెలుపుతున్న టీడీపీ శ్రేణులు

చంద్రబాబు అరెస్ట్‌ అప్రజాస్వామికం

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

కొనసాగుతున్న దీక్షలు

పర్చూరు, సెప్టెంబరు 25: ఓటుతోనే వైసీపీ అరాచ క పాలనకు బుద్ధిచెప్పాలని టీడీపీ బాపట్ల పార్లమెం ట్‌ అఽధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలు పునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు అరెస్ట్‌కు నిరసనగా స్థానిక తెలుగుదేశం పార్టీ కా ర్యాలయంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సోమ వారం నాగులపాలెం తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపట్టిన రిలే దీక్షలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు. అంతకుముందు పర్చూ రు నియోజకవర్గ పరిశీలకులు సింహాద్రి యాదవ్‌ పా ల్గొని దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ రోజురోజుకు తెలుగు దేశం పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను ఓర్వలేక ఓ టమి భయంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చంద్ర బాబు నాయుడిపై అక్రమ అరెస్ట్‌కు పాల్పడ్డారన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ అక్రమం, అనైతికమని దేశవ్యాప్తం గా నిలరసనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. అధికారు లను భయబ్రాంతులకు గురిచేసి అక్రమ పద్ధతిలో ఓటు హక్కును సైతం తొలగించే విధంగా వైసీపీ ప్ర భుత్వం అనైతిక చర్యలకు పాల్పడుతుందని ధ్వజమె త్తారు. రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు చ రమగీతం పలికేందుకు ప్రజలు సిద్ధం కావాలన్నారు. తొలుత అంబేడ్కర్‌, ఎన్టీఆర్‌, పూలే చిత్రపటాలకు పూ లమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీ పీ మండల అధ్యక్షుడు షేక్‌ షంషుద్దీన్‌, కొల్లా శ్రీనివా సరావు, అడ్డగడ్డ వెంకటేశ్వర్లు, అడ్డగడ్డ రఘబాబు, వే ణుబాబు, అడ్డగడ్డ రాముడు, కొల్లా నాగేశ్వరరావు, గ న్నపనేని నాని, కొల్లా సాంబశివరావు, పోట్రు శోభన్‌, సోమేపల్లి వెంకన్న, గొట్టిపాటి ప్రసాద్‌, అడ్డగడ్డ శ్రీని వాసరావు, కొల్లా కాపుగారి ప్రసాద్‌, దొప్పలపూడి పూ ర్ణయ్య, సుబ్బారాయుడు, కట్టా శ్రీనివాసరావు, దూళిప్ప సుబ్బారావు, గొట్టిపాటి ప్రసాద్‌, దాశి కిరణ్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ పతనం తథ్యం

చీరాల, సెప్టెంబరు 25: వైసీపీ పతనం తథ్యమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఎంఎం కొండయ్య అ న్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో చంద్రబాబుకు మద్దతుగా రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. సోమవా రం పార్టీ ముస్లిం విభాగ శ్రేణులు దీక్షలో కూర్చున్నా రు. వారికి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కొండయ్య, రాష్ట్ర కా ర్యదర్శులు నాతాని ఉమామహేశ్వరావు, సయ్యద్‌ ష రీఫ్‌, అబ్దుల్‌ అబిద్‌, ఎంఎం బేగ్‌, షేక్‌ యాసిన్‌, గౌరీ అమర్‌నాఽధ్‌, తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురా లు కొమ్మనబోయిన రజిని, బీసీ విభాగ ప్రతినిధి కౌత వరపు జనార్దనరావు తదితరులు దీక్షలో కూ ర్చున్నవారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కొం డయ్య మాట్లాడుతూ సీఎం జగన్‌ నియంత పోకడల తో వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదన్నారు. ము స్లిం ప్రతినిధులు చంద్రబాబు త్వరగా విడుదల కావా లని ప్రత్యేక ప్రార్తనలు చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు.

రాష్ట్రంలో విధ్వంసపాలన..

కారంచేడు(పర్చూరు), సెప్టెంబరు 25: నియంత పోకడలను అలంబిస్తూ అరాచకాలు, విధ్వంసాలకు వై సీపీ ప్రభుత్వం పాల్పడుతూ అక్రమ అరెస్ట్‌లకు ఒడిగ డుతుందని ఏఎంసీ మాజీ చైర్మన్‌ యార్లగడ్డ అక్క య్య చౌదరి అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసన గా కారంచేడు గ్రామ పార్టీ కార్యాలయంలో చేపట్టిన రిలే దీక్షలు సోమవారానికి 17వ రోజుకు చేరాయి. అ క్కయ్య చౌదరి నేతృత్వంలో టీడీపీ నేతలు మేము సై తం బాబుతో అంటూ ప్లకార్డ్స్‌ చేతపట్టి నిరసన కార్య క్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కంభంపాటి న రేంద్ర, పాతూరి ఆదిలక్ష్మి, పి.వెంకటేశ్వర్లు, రామచంద్ర రావు, పాలేటి హరి, బోడావుల గన్ను, గాంధి, వై.చిట్టి య్య, పేర్ని ఆంజనేయులు, లావు శ్యాం, సుబ్బయ్య, యార్లగడ్డ శ్రీలక్ష్మి, కొల్లా రమాదేవి, నువ్వుల కోటమ్మ, పేర్ని అంజనా, పోతిని హైమావతి, కోడూరి చింపిర మ్మ, పార్వతి, యార్లగడ్డ పద్మావతి, తాళ్ళూరి అనిల్‌కు మార్‌, భాస్కరరావు, బోయన శ్రీను పాల్గొన్నారు.

వ్యవసాయంపై శీతకన్ను

అద్దంకి, సెప్టెంబరు 25: వైసీసీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు వ్యవసాయం చేయలేక పారిపోయే పరిస్థితులు కల్పించారని తెలుగురైతు బాపట్ల పార్లమెంట్‌ కార్యదర్శి చింతా వెంకటేశ్వరరెడ్డి అన్నారు. చంద్రబాబునాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ అద్దంకి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యం లో పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురు రామాటా కీస్‌ స్థలంలో ఏర్పాటుచేసిన రిలే దీక్షలు సోమ వారానికి 13వ రోజుకు చేరాయి. దీక్షలో అద్దంకి నియో జకవర్గంలోని రెడ్డి సామాజికవర్గానికి చెందిన టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈసందర్బంగా వారు మాట్లాడు తూ పంటలకు మద్దతు ధర లభించటం లేదన్నారు. రైతులు పండించిన వరి, మొక్కజొన్న, శనగ పంటల ను 25 శాతం మాత్రమే కొనుగోలు చేశారన్నారు. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి నిమిత్తం రూ.12,500 ఇస్తామని చె ప్పి రూ.7,500 మాత్రమే ఇస్తున్నార న్నారు. కౌలు రైతులకు పెట్టుబడి ఇ స్తామని చెప్పి 15 లక్షల మంది ఉం టే 50 వేల మందికి మాత్రమే ఇచ్చి దగా చేశారన్నారు. మోటార్లకు మీ టర్లు బిగించి రైతుల మెడకు ఉరి బిగించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకే తంటాలు పడుతున్న ప్రభుత్వం రైతులకు ఏవిధంగా చెల్లిస్తుంద న్నారు. ప్రకాశం జిల్లాకు రావాల్సి న సాగర్‌ జలాలు 72 టీఎంసీల వాటాలో కోత విధించి 52 టీఎం సీలు మాత్రమే విడుదల చేయ టం దారుణమన్నారు. సాగర్‌ జ లాలు రాబోయే రోజులలో మంచి నీళ్ళకు మాత్రమే ఇస్తారేమోనని అ న్నారు. రాష్ట్రంలో డ్రిప్‌ ఇరిగేషన్‌ పథకం అటకెక్కిం దన్నారు. రైతు భరోసా కేంద్రాలు వైసీపీ కార్యాలయా లుగా మారాయన్నారు. రిలే దీక్షలో టీడీపీ అద్దంకి మండల మాజీ అధ్యక్షుడు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొరిశపాడు మాజీ సర్పంచ్‌ గోళ్ళమూడి సురేంద్రరెడ్డి, అంబటి వెంకటరామిరెడ్డి, ఎరకసాని లక్ష్మారెడ్డి, ఇప్ప ల అంజిరెడ్డి, వాసురెడ్డి, వై.బ్రహ్మారెడ్డి, కె.అశోక్‌ రెడ్డి, బి.శివకోటిరెడ్డి, చెన్నారెడ్డి, జగన్మోహనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అద్దంకి మండల పార్టీ అధ్యక్షుడు కఠారి నాగేశ్వరరావు, వి.భా స్కరరెడ్డి, అంబటి సుబ్బారెడ్డి, సీహెచ్‌ వెంక టరెడ్డి, కొంచా తిరుపతిరెడ్డి, వెంకకటరెడ్డి, కుక్కపల్లి ఏడుకొండలు, చింతల సహదేవుడు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిని విస్మరించిన ప్రభుత్వం

కారంచేడు(పర్చూరు), సెప్టెంబరు 25: అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించి వైసీపీ ప్రభుత్వం అరాచక, విధ్వంస పాలనకు పాల్పడుతుందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపా ఠం చెబుతారని అన్నారు. చంద్రబాబు అక్రమ అరె స్ట్‌కు నిరసనగా కారంచేడులోని మండల పార్టీ కార్యా లయంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. టీడీపీ శ్రే ణులు పెద్దఎత్తున తరలివచ్చి చంద్రన్నకు మద్దతుగా నిలుస్తున్నారు. సోమవారం చేపట్టిన రిలే దీక్షలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని మేము సైతం బాబుతో అంటూ ప్లకార్డ్‌లతో నినాదాలు చేశారు. కార్యక్రమంలో సంకా రమేష్‌, నువ్వుల శ్రీను, పాలడుగు గాంధీ, తేళ్ళ ఝాన్సీ, బోడపాటి వనజ, బోయన దేవి, సుబ్బారా యుడు, షేక్‌ లాల్‌బీ, జాగర్లమూడి రుక్మిణి, వంకా యలపాటి సు బ్బారావు, తాళ్ళూరి ఆదిలక్ష్మి, యార్లగడ్డ తిరుపతిరాయుడు, వంకాలయపాటి అనసూర్య తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న దీక్షలు

మార్టూరు, సెప్టెంబరు 25: చంద్రబా బు నాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మార్టూరులోని పార్టీ కార్యాలయంలో ఎ మ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదేశా ల కు అనుగుణంగా నాయకులు, కార్యకర్త లు చేస్తున్న రిలే దీక్షలు సోమవారం కూ డా కొనసాగాయి. మండలంలోని ద్రోణా దుల గ్రామానికి చెందిన కార్యకర్తలు, మార్టూరులోని మద్ది సీతాదేవినగర్‌కు చెందిన కార్యక ర్తలు దీక్షలో పాల్గొన్నారు. పెంట్యాల శ్రీను, పాలెపు జానకి రామ య్య, పెంట్యాల ఉమామహేశ్వరరావు, పెంట్యాల వెం కటేశ్వర్లు, పోలూరి సింగయ్య, జంపని శ్రీనివాసరాజు, పరుచూరి రామాంజనేయులు, బాచిన సుబ్బారావు, ఉప్పు చిన్నజనార్దన్‌, రామచంద్రరావు, మహేష్‌ తది తరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-25T23:09:11+05:30 IST