కొనసాగుతున్న ఆందోళన
ABN , Publish Date - Dec 31 , 2023 | 10:58 PM
డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళన 20వ రోజు ఆదివారం కూడా కొనసాగింది. ఐసీడీఎస్ కార్యాలయం వద్ద కార్యకర్తలు ధర్నా చేశారు. కబడ్డీ ఆడుతూ జీతాలు పెంచాలంటూ కూతకూస్తూ ప్రభుత్వానికి సందేశమిచ్చారు.
దర్శి, డిసెంబరు 31 : డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళన 20వ రోజు ఆదివారం కూడా కొనసాగింది. ఐసీడీఎస్ కార్యాలయం వద్ద కార్యకర్తలు ధర్నా చేశారు. కబడ్డీ ఆడుతూ జీతాలు పెంచాలంటూ కూతకూస్తూ ప్రభుత్వానికి సందేశమిచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తల యూనియన్ అధ్యక్షురాలు తిరుపతమ్మ మాట్లాడుతూ పండుగలు, సెలవదినాల్లో కూడా సమస్యల పరిష్కారం కోసం కార్యకర్తలు 20 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా సీఎం జగన్‌రెడ్డికి పట్టకపోవడం దారుణమన్నారు. ఎన్నికల ముందు, పాదయాత్రలో హామీలు గుప్పించి నేనొస్తున్నానని, అన్ని సమస్యలు తీరుస్తానని మాటిచ్చి మడమతిప్పారని దుయ్యబట్టారు. సమస్యలు పరిష్కరించకపోగా వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు మహిళలని చూడకుండా అహంకార పూరితంగా మాట్లాడడం దుర్మార్గమన్నారు. వెంటనే రూ.26వేలకు జీతం పెంచాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యవైఖరి అవలంబిస్తే పాలకులకు గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. కార్యక్రమం లో యూనియన్ నాయకులు అచ్చమాంబ, బాలమ్మ, వెంకటరమణ, సుజాత, కె రంగమ్మ, పద్మావతి, ప్రభావతి, సీఐటీయూ నాయకులు సందు వెంకటేశ్వరరావు, యూ మోహన్‌రావు, టీ రంగనాయకులు పాల్గొన్నారు.