ఫోన్‌ నెంబర్‌ హ్యాక్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2023-09-19T23:39:35+05:30 IST

రాజకీయంగా ఎదుర్కొలేక తన సెల్‌ ఫోన్‌ నెంబరు హ్యాక్‌ చేసి తాను మాట్లాడే ప్రతికాల్‌ను రికార్డు చేసి మార్కాపురం ఎమ్మె ల్యే నాగార్జునరెడ్డి, ఆయన తమ్ముడు కృష్ణమోహన్‌రెడ్డికి పంపిస్తున్న పోలీస్‌ అధికా రులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ సీనియర్‌ నాయకుడు పెద్దిరెడ్డి సూర్యప్రకా ష్‌రెడ్డి ఆరోపించారు.

ఫోన్‌ నెంబర్‌ హ్యాక్‌ చేసిన  వారిపై చర్యలు తీసుకోవాలి

ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 19 : రాజకీయంగా ఎదుర్కొలేక తన సెల్‌ ఫోన్‌ నెంబరు హ్యాక్‌ చేసి తాను మాట్లాడే ప్రతికాల్‌ను రికార్డు చేసి మార్కాపురం ఎమ్మె ల్యే నాగార్జునరెడ్డి, ఆయన తమ్ముడు కృష్ణమోహన్‌రెడ్డికి పంపిస్తున్న పోలీస్‌ అధికా రులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ సీనియర్‌ నాయకుడు పెద్దిరెడ్డి సూర్యప్రకా ష్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం సాయంత్రం ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలతో పాటు, ఇంటిలిజెన్స్‌ అ ధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో దీర్ఘకాలికంగా పనిచేస్తూ పశ్చిమ ప్రాంతంలో భూ దందాలు చేస్తున్న రాజకీయ నాయకులకు తోత్తులుగా మారి ప్రశ్నించే గొంతులను హరించేలా తన వ్యక్తిగత గోప్యత హ రించే విధంగా కొందరు పోలీసు అఽధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన భావ ప్రక టన స్వేచ్చ, వ్యక్తిగత గోప్యత హక్కులకు తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్న పోలీ స్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-09-19T23:39:35+05:30 IST