కానిస్టేబుల్ పవన్‌కు కన్నీటి వీడ్కోలు
ABN , First Publish Date - 2023-05-25T23:36:25+05:30 IST
అమరావతి ఆర్5 జోన్‌లో విధి నిర్వహణలో పాముకాటుకు గురై మృతిచెందిన కానిస్టేబుల్ ఇ.పవన్‌కుమార్ మృతదేహాన్ని గురువారం సొంతూరు చీమకుర్తిలోని దిన్నేపురానికి తీసుకొచ్చారు. పవన్ మృతదేహన్ని చూసిన కుటుంబీకులు, సన్నిహితులు బోరున విలపించారు. జడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎస్పీ మలికగర్గ్, ట్రైనీ ఐపీఎస్ అంకిత సురాన, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పవన్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చి సంతాపం తెలిపారు.

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల నివాళి
అండగా ఉంటాం : ఎస్పీ మలికగర్గ్
చీమకుర్తి, మే 25 : అమరావతి ఆర్5 జోన్‌లో విధి నిర్వహణలో పాముకాటుకు గురై మృతిచెందిన కానిస్టేబుల్ ఇ.పవన్‌కుమార్ మృతదేహాన్ని గురువారం సొంతూరు చీమకుర్తిలోని దిన్నేపురానికి తీసుకొచ్చారు. పవన్ మృతదేహన్ని చూసిన కుటుంబీకులు, సన్నిహితులు బోరున విలపించారు. జడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎస్పీ మలికగర్గ్, ట్రైనీ ఐపీఎస్ అంకిత సురాన, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పవన్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చి సంతాపం తెలిపారు. పవన్ కుటుంబానికి అండగా ఉంటామని ఎస్పీ గర్గ్ భరోసా ఇచ్చారు. అనంతరం అధికార లాంఛనాలతో అంతిమయాత్ర నిర్వహించారు. పోలీసు గౌరవ వందనంగా మూడుసార్లు గాల్లోకి కాల్పులు జరిపి అనంతరం దహన సంస్కారాలు నిర్వహించారు. అంతిమయాత్రలో డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి, డీఎ్‌సబీ డీఎస్పీ బి.మరియదాసు, సీఐలు, ఎస్‌ఐలు, సహచర సిబ్బంది, మిత్రులు, బంధువులు పాల్గొన్నారు.