ప్రాణం తీసిన ఇసుక టిప్పర్
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:39 AM
దేవుడు ఉత్సవం కోసం పూలు తెచ్చేందుకు వెళుతున్న యువకుడిని మృత్యువు కబళించింది. ఈ సంఘటన ఒంగోలు నగర శివారు ప్రాం తం వెంగముక్కపాలెంరోడ్డులోని శ్రీకర విల్లాస్ వద్ద శని వారం ఉదయం జరిగింది.
ఎదురుగా ఢీకొనడంతో మోటర్‌సైక్లిస్టు మృతి
ప్రైవేటు కాలేజీలో అటెండర్‌గా విధుల నిర్వహణ
చక్రాల కిందపడి ఛిద్రమైన దేహం
కుటుంబసభ్యుల కన్నీరుమున్నీరు
న్యాయం కోసం బంధువుల ఆందోళన
ఒంగోలు(క్రైం), డిసెంబరు 16: దేవుడు ఉత్సవం కోసం పూలు తెచ్చేందుకు వెళుతున్న యువకుడిని మృత్యువు కబళించింది. ఈ సంఘటన ఒంగోలు నగర శివారు ప్రాం తం వెంగముక్కపాలెంరోడ్డులోని శ్రీకర విల్లాస్ వద్ద శని వారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో యర్రజర్లకు చెందిన కంకణాల చిరంజీవి(45) దుర్మరణం చెందాడు. వివరాలలోకి వెళితే.. స్థానిక క్విస్ ఇంజినీరింగ్ కళాశాలలో అటెండర్‌గా పనిచేస్తున్న చిరంజీవి తన స్వగ్రామామైన యర్రజర్లలో దేవుని ఉత్సవం ఉండటంతో పూలు తీసుకొ చ్చేందుకు మోటార్‌సైకిల్‌పై ఒంగోలు వెళుతున్నారు. అ యితే ఇసుక లోడుతో ఉన్న టిప్పర్ శ్రీకర విల్లాస్‌లోకి వెళుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతో ఎదురుగా వ చ్చిన మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టాడు. దీంతో వాహనంతో స హ చిరంజీవిపై టిప్పర్ టైర్లు ఎక్కడంతో శరీరం నుజ్జునుజ్జయి అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసు కున్న తాలుకా సీఐ భక్తవత్సలరెడ్డి తన సిబ్బందితో సం ఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించారు. టిప్పర్‌ను పక్కకు తీసి మృతుని వద్ద దొరికిన చిరునామా ఆధారంగా యర జర్లకు చెందిన చిరంజీవిగా గుర్తించి వారి కుటుంబస భ్యులకు సమాచారం ఇచ్చారు. రెవెన్యూ అధికారుల సమ క్షంలో మృతదేహన్ని రిమ్స్‌కు తరలించారు. టిప్పర్‌ను స్వాధీనం చేసుకొని ఆర్టీవో కార్యాలయంలో పార్కు చేయి ంచారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కన్న తండ్రి ఆవేదన..
టిప్పర్ ప్రమాదంలో చిరంజీవి మృతి చెందడంతో ఆ యన తండ్రి శ్రీనివాసరావు కన్నీరుమున్నీరయ్యారు. పో లీసులు హడవుడిగా సంఘటన స్థలంలో రక్తపు మరక లపై మట్టి వేయడం, ఛిద్రమైన శరీరభాగాలను కాలువలో పడేయడం ఏమిటన్న వాపోయారు. అంతేగాకుండా కనీ సం బంధువులు వచ్చేవరకు సంఘటన స్థలంలో మృత దేహం లేకుండా రిమ్స్‌కు తరలిచడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారని, తాము వచ్చే లోపే తన కుమారుడి మృతదేహాన్ని హడావుడిగా తరలించడం ఏమిటి అని బోరున విలపించారు.
బంధువులు ఆందోళన
ప్రమాదంలో మృతి చెందిన చిరంజీవికి భార్య అనుషా తో పాటు రీతు, జస్వితా అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద చనిపోవడంతో వారిని ఓదార్చడం ఎవరిత రం కాలేదు. ఈక్రమంలో బాధిత కుటుంబానికి న్యాయం చేసే వరకు పోస్టుమార్టం చేయోద్దంటూ చిరంజీవి కు టుంబ సభ్యులతో పాటుగా టీడీపీ నాయకులు రిమ్స్ ఎ దురుగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. మృతు డికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, ఆ కుటుంబానికి న్యా యం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన శనివారం రాత్రి వరకు జరిగింది. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కఠారి నాగేశ్వరరావు, ఎద్దు శశికాంత్‌భూషణ్, మదన్, రా వుల పద్మ, కుసుమకుమారితో పాటుగా మృతుని బంధు వులు ఉన్నారు.
ట్రాఫిక్ రద్దీ వల్ల మృతదేహం తరలింపు : సీఐ
వెంగముక్కపాలెం రోడ్డులో ఉదయం కాలేజీ బస్సులు తిరగడంతోపాటుగా నగరంలోకి వివిధ పనులు కోసం వ చ్చేవారి వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని తాలుకా సీఐ భక్తవత్సలరెడ్డి తెలిపారు. ఈ ప్రమాదంలో టిప్పర్‌ను తొలిగించిన తరువాతనే మృతుడి చిరునామా గుర్తించామ ని చెప్పారు. వెంటనే మృతదేహాన్ని రెవెన్యూ అధికారుల సమక్షంలో రిమ్స్‌కు తరలించినట్లు చెప్పారు.